డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న shahrukh khan కొడుకు aryan khan

ABN , First Publish Date - 2022-04-11T22:36:59+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన

డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న shahrukh khan కొడుకు aryan khan

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక కోర్టు పలుమార్లు తిరస్కరించింది. అనంతరం అతడు బాంబే హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్యన్ అనేక ఐడియాలపై పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా లేదా వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించడం ద్వారా బాలీవుడ్‌లోకి అతడు ఎంట్రీ ఇవ్వనున్నాడు.


కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఓ వెబ్‌సిరీస్‌ లేదా సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ ఎంటర్‌ టైన్‌మెంం‌ట్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెస్ట్ షూట్ ముంబైలోని ఓ స్టూడియోలో ఈ మధ్యనే జరిగినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘‘ఈ ప్రాజెక్టుకు ఆర్యన్ కథను రాయడంతో పాటు దర్శకత్వం కూడా వహించనున్నాడు. షూటింగ్ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ప్రాజెక్టు మీద అవగాహన ఉండాలని అతడు భావిస్తున్నాడు. అందుకే ఏప్రిల్ 8, 9 తేదీల్లో టెస్ట్ షూట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది’’ అని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. షారూఖ్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లోకి ఆమె రంగ ప్రవేశం చేయనుంది. ‘అర్చీస్’ కామిక్స్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-04-11T22:36:59+05:30 IST