19 రోజుల తర్వాత 10 నిమిషాలు మాట్లాడేందుకు మొట్టమొదటిసారి వచ్చిన తండ్రి షారూఖ్‌కు Aryan Khan ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2021-10-21T18:15:02+05:30 IST

డ్రగ్స్ కేసులో ఈ నెల రెండో తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

19 రోజుల తర్వాత 10 నిమిషాలు మాట్లాడేందుకు మొట్టమొదటిసారి వచ్చిన తండ్రి షారూఖ్‌కు Aryan Khan ఏం చెప్పాడంటే..

డ్రగ్స్ కేసులో ఈ నెల రెండో తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. అప్పట్నంచి షారూక్ ఖాన్ తన ఇంటి నుంచి బయటకు రాలేదు. కొడుకుని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఆర్యన్‌కు బెయిల్ దొరకడం లేదు. తాజాగా మూడోసారి కూడా ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌ను కలిసేందుకు షారూక్ ఈ రోజు (గురువారం) ఉదయం ఆర్థర్ రోడ్డు జైలుకు వెళ్లాడు. 


ఆర్యన్‌తో షారూక్ దాదాపు 18 నిమిషాలు మాట్లాడినట్టు జైలు వర్గాల సమాచారం. గ్లాస్ డోర్ అవతల ఆర్యన్, ఇవతల షారూక్ కూర్చుని ఇంటర్‌కమ్ ద్వారా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. షారూక్‌ను చూసినప్పటి నుంచి చివరి వరకు ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడట. `ఐ యామ్ సారీ` అని తండ్రికి చెబుతూనే ఉన్నాడట. షారూక్ కూడా భావోద్వేగానికి గురైనప్పటికీ ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడట. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఆర్యన్‌తో మాట్లాడాడట. ఆర్యన్ పదే పదే `సారీ` చెబుతుంటే `నేను నిన్ను నమ్ముతున్నాన`ని చెప్పాడట. ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారట. దాదాపు 18 నిమిషాల అనంతరం షారూక్ బయటకు వచ్చేశాడు. 

Updated Date - 2021-10-21T18:15:02+05:30 IST