ఫస్ట్ లవ్‌తో బిజీగా ఉన్న షాహిద్ కపూర్ భార్య.. రెండో లవ్‌గా ఉండటానికి ఓకే అంటున్న స్టార్ హీరో

ABN , First Publish Date - 2022-01-14T23:43:27+05:30 IST

టాలీవుడ్ హిట్ చిత్రం ‘‘ అర్జున్ రెడ్డి ’’ హిందీ రీమేక్‌ ‘‘ కబీర్ సింగ్ ’’లో షాహిద్ కపూర్ నటించారు.

ఫస్ట్ లవ్‌తో బిజీగా ఉన్న షాహిద్ కపూర్ భార్య.. రెండో లవ్‌గా ఉండటానికి ఓకే అంటున్న స్టార్ హీరో

టాలీవుడ్ హిట్ చిత్రం ‘‘ అర్జున్ రెడ్డి ’’ హిందీ రీమేక్‌ ‘‘ కబీర్ సింగ్ ’’లో షాహిద్ కపూర్ నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ సినిమా రికార్డులను తిరగరాయడంతో మరో టాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటించారు. ‘‘ జెర్సీ’’ ని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. కరోనా ఆంక్షలతో ఆ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఆయన సరదాగా సెలవులను గడుపుతున్నారు. తాజాగా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ నా భార్యకు రెండో లవ్‌గా ఉండటానికి నేను ఓకే ’’ అని ఆ వీడియో కింద కామెంట్ చేశారు. అయితే.. షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌ఫుత్ ఫస్ట్ లవ్ ఎవరు..? అతడు అలా అనడానికి కారణం ఏమిటి..? ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే స్టోరీని చదివేయండి .. 


మీరా రాజ్‌ఫుత్ ఫోన్‌ను వాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షాహిద్ పోస్ట్ చేశారు. ‘‘ మొదటి లవ్‌తో మీరా బిజీగా ఉంది. ఆమెకు రెండో లవ్‌గా ఉండటానికి ఓకే ’’ అని కామెంట్ చేశారు. షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్..‘‘ అవునా ’’ అని స్పందించారు. కాదు. షాహిదే తన మొదటి లవ్వాని 3హార్ట్ ఎమోజీలతో మీరా రాజ్‌ఫుత్ రిప్లై ఇచ్చింది.


షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘‘ జెర్సీ ’’. ఆ సినిమా డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉన్న రిలీజ్ కాలేదు. పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదిని చిత్ర బృందం ఇంతవరకు ప్రకటించలేదు. షాహిద్ ప్రస్తుతం రాజ్, డీకే తెరకెక్కించబోయే వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు.



Updated Date - 2022-01-14T23:43:27+05:30 IST