పిల్లలు, జంతువులతో చాలా ప్రమాదం అంటొన్న Shahid Kapoor...

ABN , First Publish Date - 2022-01-14T00:37:03+05:30 IST

చిన్న పిల్లలు, జంతువులతో నటన అంటే తెగ భయపడిపోతున్నాడు షాహిద్ కపూర్. ‘జెర్సీ’ రీమేక్‌తో జనాల్ని పలకరించబోతోన్న ‘కబీర్ సింగ్’... చిల్డ్రన్ అండ్ యానిమల్స్ తన రిథిమ్ బ్రేక్ చేసే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చాడు. పిల్లలు, జంతువులతో కలసి నటించేటప్పుడు ఏ క్షణంలోనైనా మొత్తమంతా శ్రుతి తప్పి పోవచ్చని హెచ్చరిస్తున్నాడు.

పిల్లలు, జంతువులతో చాలా ప్రమాదం అంటొన్న Shahid Kapoor...

చిన్న పిల్లలు, జంతువులతో నటన అంటే తెగ భయపడిపోతున్నాడు షాహిద్ కపూర్. ‘జెర్సీ’ రీమేక్‌తో జనాల్ని పలకరించబోతోన్న ‘కబీర్ సింగ్’... చిల్డ్రన్ అండ్ యానిమల్స్ తన రిథిమ్ బ్రేక్ చేసే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చాడు. పిల్లలు, జంతువులతో కలసి నటించేటప్పుడు ఏ క్షణంలోనైనా మొత్తమంతా శ్రుతి తప్పి పోవచ్చని హెచ్చరిస్తున్నాడు.


‘‘వాళ్లు తమకు ఏది నచ్చితే అది చేస్తారు. చివరకు, వాళ్లు సరైన షాట్ ఇచ్చే సరికి, ఎదుటి వారు విసిగి వేసారి పోయి  సగం చచ్చిపోతారు!’’ అన్నాడు షాహిద్ కపూర్. ఆయన పిల్లలు, జంతువుల గురించి అలా మాట్లాడటానికి కారణం... ‘జెర్సీ’లో తండ్రి పాత్రలో నటించాడు షాహిద్. తెలుగులో నాని చేసిన క్యారెక్టర్ హిందీలో ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు. ఓ మాజీ క్రికెటర్‌గా, ప్రేమికుడిగా, భర్తగా, తండ్రిగా అనేక షేడ్స్ ఉంటాయి షాహిద్ రోల్‌కి. ఆ క్రమంలోనే ఆయన ఓ పిల్లాడితో నటించాల్సి వచ్చింది! 


మన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని ‘కబీర్ సింగ్‌’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న షాహిద్ రెండోసారి తెలుగు చిత్రంతో అదృష్టం పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే, ‘జెర్సీ’ రీమేక్‌గా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ, పెరుగుతోన్న కరోనా కేసుల మూలంగా వాయిదా పడుతూ వస్తోంది. షాహిద్, మృణాళ్ ఠాకూర్ స్టారర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే... 

Updated Date - 2022-01-14T00:37:03+05:30 IST