Aryan Khan అరెస్ట్ తర్వాత తొలిసారి కనిపించిన Sharukh khan.. మనస్థాపం చెందిన కొడుకుని కలిసేందుకు..

ABN , First Publish Date - 2021-10-21T17:03:15+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.

Aryan Khan అరెస్ట్ తర్వాత తొలిసారి కనిపించిన Sharukh khan.. మనస్థాపం చెందిన కొడుకుని కలిసేందుకు..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా మూడోసారి కూడా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ముంబై తీరానికి సమీపంలోని క్రూయిజ్ షిప్‌లో పార్టీ చేసుకుంటూ ఈ నెల 2వ తేదీన ఆర్యన్ అరెస్టు అయ్యాడు. ఈ నెల 8వ తేదీ నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పట్నుంచి ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పై బయటకు తీసుకురావడానికి షారుక్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. అయినా ఆర్యన్‌కు బెయిల్ దొరకడం లేదు. దీంతో షారూక్ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నాడు. 


కాగా, బెయిల్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆర్యన్‌ను కలవడానికి షారూక్ ఆర్థర్ రోడ్ జైలుకు ఈ రోజు (గురువారం) ఉదయం వెళ్లాడు. ఆర్యన్ అరెస్ట్ అయిన తర్వాత షారుక్ బయట కనిపించడం ఇదే తొలిసారి. ఆర్థర్ రోడ్ జైలుకు చేరుకున్న షారూక్‌కు అభిమానులు సంఘీభావం తెలిపారు. వారికి అభివాదం చేసిన షారూక్ లోపలికి వెళ్లాడు. కాగా, మూడోసారి కూడా బెయిల్ దొరక్కపోవడంతో ఆర్యన్ ఖాన్ తీవ్ర మనస్థాపం చెందినట్టు వార్తలు వస్తున్నాయి.


Updated Date - 2021-10-21T17:03:15+05:30 IST