షారూఖ్ - అట్లీ మూవీ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..!

ABN , First Publish Date - 2021-09-09T14:35:48+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో ఇటీవలే కొత్త మూవీ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే.

షారూఖ్ - అట్లీ మూవీ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..!

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో ఇటీవలే కొత్త మూవీ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయనున్నట్టు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఇందులో నయనతార, ప్రియమణి హీరోయిన్స్‌గా, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. షారూఖ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్టు సమాచారం. 'జవాన్' అనే టైటిల్‌తో రూపొందుతున్న దీనికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెకర్ ఏ.ఆర్.రెహమాన్ సాంగ్స్‌కి మ్యూజిక్ అందిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందివ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు రానుందో. కాగా ఇంతకముందు కూడా వీరిద్దరు కలిసి 'మెర్సల్', 'బిగిల్' సినిమాలకు పని చేశారు. 

Updated Date - 2021-09-09T14:35:48+05:30 IST