మా అమ్మ కాళ్లను షారూఖ్‌ ఖాన్ మొక్కారంటున్న సింగర్..ఆయన కోసం ప్రార్థిస్తున్నట్టు వెల్లడి..

ABN , First Publish Date - 2021-10-22T00:25:20+05:30 IST

ఆర్యన్ ఖాన్ కేసులో బాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ఇప్పటికే షారూఖ్‌కు తమ మద్దతును తెలిపారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరారు. బాలీవుడ్ నుంచి కాకుండా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈ సారి బాలీవుడ్ బాద్‌షాకు మద్దతు లభించింది.

మా అమ్మ కాళ్లను షారూఖ్‌ ఖాన్ మొక్కారంటున్న సింగర్..ఆయన కోసం ప్రార్థిస్తున్నట్టు వెల్లడి..

ఆర్యన్ ఖాన్ కేసులో బాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ఇప్పటికే షారూఖ్‌కు తమ మద్దతును తెలిపారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరారు. బాలీవుడ్ నుంచి కాకుండా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈ సారి బాలీవుడ్ బాద్‌షాకు మద్దతు లభించింది. తన తల్లి కాళ్లు కింగ్ ఖాన్ మొక్కారని ఒక సింగర్ తెలిపింది. ఈ కష్ట కాలంలో అతడి కుటుంబం కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు ఆమె చెప్పింది. 


టాలీవుడ్‌లో అనేక పాటలు పాడి అందరికి సుపరిచితురాలైన సింగర్ చిన్మయి శ్రీపాద. షారూఖ్ హీరోగా తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో ఆమె ‘‘తిత్లీ’’ పాటను  పాడింది. ఆ సినిమా సమయంలో షారూఖ్ చెప్పిన మాటలను తనెప్పుడు మరిచిపోనని ఆమె చెప్పింది. ఆయనకు మద్దతు తెలుపుతూ ట్విట్టర్‌లో వరుసగా ఆమె ట్వీట్‌లు చేసింది. ‘‘ కొన్ని ఏళ్ల క్రితం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో నేను ‘తిత్లీ’ అనే పాట పాడాను. అప్పుడు షారూఖ్ నన్ను ట్యాగ్ చేస్తూ మెచ్చుకున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఒక నటుడు నా పాట గురించి గొప్పగా చెప్పడం అదే మొదటిసారి. ఎవరూ పొగిడినా నేను ఎటువంటి ఉత్సాహనికి లోను కాను. అందువల్ల మా అమ్మ ఆయన ట్వీట్‌ను గుర్తించి జవాబు ఇచ్చింది.  చెన్నై ఎక్స్ ప్రెస్ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు నేను వెళ్లాను. అప్పుడు మా అమ్మ చేసిన ట్వీట్‌ను గుర్తుంచుకొని కింగ్ ఖాన్ థ్యాంక్స్ చెప్పారు. కొన్ని గంటల అనంతరం నేను అందరికీ బై చెబుతున్నాను. షారూఖ్ ఆ సమయంలో మా అమ్మతో మాట్లాడతానన్నారు. ఆయన జోక్ చేస్తున్నాడేమోనని నేను అనుకున్నాను. నా ఫోన్‌ను తీసుకుని వెంటనే మా అమ్మకు కాల్ చేసి 15 నిమిషాల పాటు మాట్లాడారు.  మా అమ్మ చాలా సంతోషంగా ఫీల్ కావడంతో ఫోన్‌ను పెట్టేశారు ’’ అని తెలిపింది.


‘‘ ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల అనంతరం చెన్నైకి షారూఖ్ విచ్చేశారు. ఒక పెద్ద గదిలో ప్రజలందరూ ఆయన కోసం వేచి చూస్తుండగా మా అమ్మను గుర్తు పట్టి ఆమె కాళ్లను మొక్కారు. ఆ సమయంలో నేను బావోద్వేగానికి లోనయ్యాను. ఒక సూపర్ స్టార్ ఈ విధంగా చేయడం చాలా బాగా అనిపించింది. ఆయనకు మా అమ్మ కాళ్లను మొక్కాల్సిన అవసరం లేవు. కానీ, కాళ్లు మొక్కారు. ఏది ఏమైనా సరే వారు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి అతడి కుటుంబం కోసం నేను తప్పక ప్రార్థిస్తాను ’’ అని ఆమె చెప్పింది. షారూఖ్ చేసిన ట్వీట్  స్ర్కీన్ షాట్ ను ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.  చెన్నై ఎక్స్‌ప్రెస్ అడియో లాంచ్ ఈవెంట్ 2013 జులైలో జరిగింది. ఆ సమయంలోనే చిన్మయి పాడిన తిత్లీ పాటను మెచ్చుకుంటూ షారూఖ్ ట్వీట్ చేశారు.



Updated Date - 2021-10-22T00:25:20+05:30 IST