ఆర్యన్ ఖాన్‌కు ‘జీవిత పాఠాలు’... గురువు ఎవరో తెలుసా? గతంలో హృతిక్‌కి కూడా...

బాలీవుడ్‌లో వినిపిస్తోన్న తాజా సమాచారం ప్రకారం... షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి ‘జీవిత పాఠాలు’ నేర్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయట! అవును, నిజమే... మీరు విన్నదే కరెక్టే! ఆర్యన్ ఖాన్ ‘లైఫ్ లెసెన్స్’ నేర్చుకునేందుకు రెడీ అవుతున్నాడు!


గత అక్టోబర్‌లో ఆర్యన్ అమాంతం నేషనల్ న్యూస్ అయిపోయాడు. ఓ డ్రగ్స్ పార్టీలో ఎన్సీబీకి చిక్కి మూడు వారాలు జైల్లో ఉండి వచ్చాడు. దాంతో కింగ్ ఖాన్ వారసుడు డ్రగ్ ఎడిక్ట్ అంటూ సొషల్ మీడియాలో, మీడియాలో  ఓ వర్గం నాన రచ్చ చేసింది. అదే సమయంలో, బాలీవుడ్ బాద్షాకి అండగా నిలిచిన బీ-టౌన్ విధేయులు కూడా చాలా మందే ఉన్నారు. సూపర్ స్టార్‌కి, అతడి తనయుడికి వీలైనంత మద్దతు ప్రకటించారు. కానీ, ఈ హంగామా మొత్తంలో 24 ఏళ్ల ఆర్యన్ మాత్రం మానసికంగా బాగానే కృంగిపోయాడు. ముంబై ఆర్థర్ రోడ్ జైలులో వందలాది మంది సామాన్య ఖైదీల మధ్య ఉండటం అతడికి ఒక విధంగా జీవిత కాలం గుర్తుండిపోయే దుర్భర జ్ఞాపకం. దాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలంటే తప్పకుండా గొప్ప మానసిక పరివర్తన కావాలి. అందుకే, ‘లైఫ్ కోచ్’ అర్ఫీన్ ఖాన్‌ను అప్రోచ్ అయ్యారట షారుఖ్, గౌరీ... 

    

అర్ఫీన్ ఖాన్ ‘పరివర్తన నిపుణుడు’! అంటే, ఏంటి అంటారా? జీవితంలో తీవ్రమైన సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిల్లోంచి బయటపడవేసే ‘కౌన్సిలర్’ అనుకోవచ్చు. ఆయన సలహాలు, సూచనలు, ప్రేరణతోనే హృతిక్ ఆ మధ్య మానసిక ఆందోళన, ఒత్తిడి లోంచి బయటపడ్డాడట. ఆయన తన మాజీ భార్య సుజానే నుంచీ విడాకులు తీసుకున్నాక డిప్రెషన్‌లోకి లోనైతే అర్ఫీన్ ఖాన్ తిరిగి మామూలు మనిషిని చేశాడు. మరికొందరు బీ-టౌన్ బిగ్గీస్ కూడా ఆయన సేవలందుకున్నారట. అందుకే, తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘బాలీవుడ్స్ నంబర్ వన్ కోచ్’ అని ప్రకటించుకున్నాడు అర్ఫీన్. 


ఆర్యన్ ఖాన్‌కి అర్ఫీన్ ఖాన్ చేత జీవిత పాఠాలు నేర్పిస్తారనేది ప్రస్తుతానికైతే ప్రచారమే. ఇంకా దీనిపై షారుఖ్ అధికారికంగా స్పందించలేదు. అయితే, కింగ్ ఖాన్ తరుఫు నుంచీ ఎవరూ అర్ఫీన్ ఖాన్ వార్తల్ని ఖండించకపోవటం ఆసక్తి రేపుతోంది...                               

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.