హిందీ టీవీ నటి షగుఫ్తా అలీ ప్రస్తుతం వార్తల్లో తరచూ కనిపిస్తున్నారు. ఆమె సాస్, ససురాల్ సిమర్‌కా, బేపనా తదితర సూపర్‌హిట్ సీరియళ్లలో నటించారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తాను నాలుగేళ్ల నుంచి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉందని, మధుమేహ సమస్యలు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. తనకు సీరియళ్లలో నటించేందుకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నానన్నారు. టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ తనను సంప్రదించి, సాయం చేస్తామని చెప్పగా తాను నిరాకరించానన్నారు. తాను సోనూసూద్ నుంచి సాయం పొందాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి సోనూసూద్ సాయం మాత్రమే చేయడం లేదని, అంతకుమించిన సేవలు అందిస్తున్నారని షగుప్తా అలీ పేర్కొన్నారు. తాను సోనూసూద్ ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఇంకా తన ప్రయత్నం నెరవేరలేదన్నారు.