Venkatesh : టాలీవుడ్ రీమేక్ రాజా

ABN , First Publish Date - 2021-11-29T15:17:27+05:30 IST

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఒరిజినల్ వెర్షన్ కన్నా బెటర్ గా తీర్చిదిద్ది.. రీమేక్ వెర్షన్స్ తో హిట్స్ కొట్టిన సినిమాలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అలాగే.. రీమేక్ వెర్షన్స్ తోనే రికార్డులు నెలకొల్పిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో రీమేక్ సినిమాల్లో నటించి వాటిలో చాలా సినిమాలతో సక్సెస్ సాధించిన హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ ఇప్పటి వరకూ అంటే ‘దృశ్యం 2’ వరకూ తన కెరీర్ లో మొత్తం 26 రీమేక్ మూవీస్ లో నటించి సత్తా చాటుకున్నారు.

Venkatesh : టాలీవుడ్ రీమేక్ రాజా

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఒరిజినల్ వెర్షన్ కన్నా  బెటర్ గా తీర్చిదిద్ది.. రీమేక్ వెర్షన్స్ తో  హిట్స్ కొట్టిన సినిమాలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అలాగే.. రీమేక్ వెర్షన్స్ తోనే రికార్డులు నెలకొల్పిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో రీమేక్ సినిమాల్లో నటించి వాటిలో చాలా సినిమాలతో సక్సెస్ సాధించిన హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ ఇప్పటి వరకూ అంటే ‘దృశ్యం 2’ వరకూ తన కెరీర్ లో మొత్తం 26 రీమేక్ మూవీస్ లో నటించి సత్తా చాటుకున్నారు. వాటిలో చాలా సినిమాలు సక్సెస్ సాధించడం విశేషంగా చెప్పాలి. వెంకటేశ్ తన కెరీర్ లో నటించిన మొట్టమొదటి రీమేక్ మూవీ ‘భారతంలో అర్జునుడు’. సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘అర్జున్’ హిందీ సినిమాకిది రీమేక్.  ఆ తర్వాత వచ్చిన రీమేక్ మూవీ ‘త్రిమూర్తులు’. ‘నసీబ్’ బాలీవుడ్ మూవీకిది రీమేక్ వెర్షన్. అయితే వెంకీ నటించిన ఈ రెండు బాలీవుడ్ రీమేక్ మూవీస్ ఫ్లాప్ అవడంతో.. ఆ తర్వాత ఓ తమిళ రీమేక్ లో నటించారు. సినిమా పేరు ‘బ్రహ్మపుత్రుడు’. దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెంకీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. రఘువరన్ హీరోగా నటించిన ‘మైకేల్ రాజ్’ అనే తమిళ సినిమాకిది రీమేక్ వెర్షన్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. దీని తర్వాత  వెంకీ తమిళ రీమేక్స్ జెర్నీ మరింత ఉత్సాహం కొనసాగింది. 


ఆ తర్వాత వెంకీ నటించిన ‘వారసుడొచ్చాడు’ చిత్రం.. మోహన్ హీరోగా నటించిన  తమిళ సినిమా ‘తీర్థ కరైయినిలే’ కి రీమేక్ వెర్షన్. ఆ తర్వాత ‘టూ టౌన్ రౌడీ’ చిత్రం సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ‘తేజాబ్’ కి రీమేక్ వెర్షన్. ఆ తర్వాత వచ్చిన ‘చంటి’ చిత్రం ‘చిన్నతంబి’ తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ వెర్షన్. అయితే ఒరిజినల్ వెర్షన్ కన్నా తెలుగు వెర్షన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ‘చిన్నగౌండర్’ ను ‘చినరాయుడు’గానూ, సుందర కాండమ్ చిత్రాన్ని ‘సుందరకాండ’గానూ, రజనీకాంత్ ‘అన్నామలై’ చిత్రాన్ని ‘కొండపల్లి రాజా’గానూ, భాగ్యరాజా ‘ఎంగ చిన్నరాజా’  సినిమాను ‘అబ్బాయిగారు’ గానూ, ‘ఆంఖే’ బాలీవుడ్ మూవీని ‘పోకిరిరాజా’గానూ, ‘తాయ్ కులమే తాయ్ కులమే’ తమిళ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’గానూ, ‘సూర్యవంశం’ తమిళ చిత్రాన్ని ‘సూర్యవంశం’గానూ,  ‘ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్’ చిత్రాన్ని ‘రాజా’ గానూ, ‘సొల్లామలే’ చిత్రాన్ని ‘శీను’ గానూ, ‘ప్రియమాన తోళి’ చిత్రాన్ని ‘వసంతం’ గానూ,   బాలీవుడ్ వెడ్నెస్ డే ను ‘ఈనాడు’గానూ, ‘కాక్కకాక్క’ తమిళ సినిమాను ‘ఘర్షణ’ గానూ, ఆనందం చిత్రాన్ని సంక్రాంతి గానూ, ‘బాడీ‌గార్డ్’ మలయాళ చిత్రాన్ని ‘బాడీగార్డ్’ గానూ, బోల్ బచ్చన్ హిందీ మూవీని ‘మసాలా’ గానూ, ‘ఆప్తరక్షక’ కన్నడ చిత్రాన్ని ‘నాగవల్లి’గానూ, ఒమైగాడ్ బాలీవుడ్ మూవీని ‘గోపాలా గోపాలా’ గానూ, దృశ్యం మలయాళ మూవీని ‘దృశ్యం’ గానూ,  ‘అసురన్’ తమిళ మూవీని ‘నారప్ప’గానూ, దృశ్యం2 మలయాళ చిత్రాన్ని ‘దృశ్యం 2’ గానూ రీమేక్ చేసి టాలీవుడ్ రీమేక్ రాజా అనిపించుకున్నారు వెంకటేశ్. 

Updated Date - 2021-11-29T15:17:27+05:30 IST