సున్నితమైన ప్రేమకథ

ABN , First Publish Date - 2021-11-17T06:43:14+05:30 IST

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్‌ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ నిర్మాత. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ లో లాంఛనంగా ప్రారంభమైంది...

సున్నితమైన ప్రేమకథ

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్‌ ఉబ్బన దర్శకుడు.  అహితేజ బెల్లంకొండ నిర్మాత. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌నిచ్చారు. సంగీత దర్శకుడు రఘు కుంచె స్విచ్చాన్‌ చేశారు. రక్షిత్‌ మాట్లాడుతూ ‘‘పలాసతో నాకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ‘నరకాసుర’ అనే సినిమా చేస్తున్నా. వాటితో పోలిస్తే.. ‘శశివదనే’ వైవిఽఽధ్యంగా ఉంటుంది. ఇదో సున్నితమైన ప్రేమకథ’’ అన్నారు. ‘‘మా టైటిల్‌ నెల రోజుల క్రితమే ప్రకటించాం. చాలా మంచి స్పందన వచ్చింది. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలెడతామ’’ని నిర్మాత తెలిపారు. శ్రీమాన్‌, ప్రిన్స్‌ దీపక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్‌. 


Updated Date - 2021-11-17T06:43:14+05:30 IST