‘అమితాబ్‌లో చూశా.. మళ్లీ గల్లా అశోక్‌లో ఆ టైమింగ్ చూశా..’

ABN , First Publish Date - 2022-01-18T03:37:16+05:30 IST

అమితాబ్‌లో ఉన్న టైమింగ్.. మళ్లీ గల్లా అశోక్‌లో చూశానని అన్నారు సీనియర్ నటుడు నరేష్. అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై

‘అమితాబ్‌లో చూశా.. మళ్లీ గల్లా అశోక్‌లో ఆ టైమింగ్ చూశా..’

అమితాబ్‌లో ఉన్న టైమింగ్.. మళ్లీ గల్లా అశోక్‌లో చూశానని అన్నారు సీనియర్ నటుడు నరేష్. అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు‌. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌లై పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. 


ఈ కార్యక్రమంలో న‌రేశ్ మాట్లాడుతూ.. ‘‘క‌థ చెప్పిన‌ప్పుడే మంచి సినిమా అని తెలుసు. డ‌బ్బింగ్‌లో కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఆ రిజ‌ల్ట్ థియేట‌ర్‌లో చూశాం. ఫ‌స్టాఫ్ ఎలా ముగిసిందో కూడా తెలీయ‌లేదు. వెంట‌నే ద‌ర్శ‌కుడిని హ‌గ్ చేసుకున్నా. కోడిపందాలు ఎంట‌ర్‌టైన్ ఇస్తాయి. ఇది సంక్రాంతి కోడి పందెంలాంటిది. హీరో టైటిల్ చూసి మాస్ సినిమా అనుకున్నారు. కానీ హిలేరియ‌స్ కామెడీ సినిమాగా ద‌ర్శ‌కుడు మ‌లిచారు. అంద‌రూ బాగా న‌టించారు. కామెడీ టైమింగ్ ఉన్న ఏ హీరో అయినా బాగా స‌క్సెస్ అవుతాడు. అమితాబ్‌లో అలా చూశాను. అశోక్‌లో మళ్లీ ఆ టైమింగ్ కనిపించింది..’’ అని అన్నారు.

Updated Date - 2022-01-18T03:37:16+05:30 IST