సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా ‘పల్లె గూటికి పండగొచ్చింది’

ABN , First Publish Date - 2022-01-10T03:30:33+05:30 IST

కె. ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత హీరోహీరోయిన్లుగా.. తిరుమలరావు దర్శకత్వంలో, సీనియర్ నటి కె రాజ్యలక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ‘పల్లె గూటికి పండగొచ్చింది’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను

సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా ‘పల్లె గూటికి పండగొచ్చింది’

కె. ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత హీరోహీరోయిన్లుగా.. తిరుమలరావు దర్శకత్వంలో, సీనియర్ నటి కె రాజ్యలక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ‘పల్లె గూటికి పండగొచ్చింది’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ.. ‘‘పల్లెల్లో ఉన్న యువత ఏ విధంగా చెడు మార్గంలో వెళుతోంది. వారి ప్రవర్తనను మంచి మార్గంలో చేసుకుంటే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా స్మార్ట్ విలేజ్‌ని నిర్మించవచ్చు అనేదే చిత్ర కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి‌లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఇందులో క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. చూసిన వారంతా షాక్ అవుతారు. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు.


సీనియర్ నటి, నిర్మాత రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నేను నటించలేదు కానీ .. మా అబ్బాయి హీరోగా యాక్ట్ చేశాడు. అందరూ ఒక సెలబ్రిటీ కొడుకు ఈజీగా హీరో అవుతాడు అనుకుంటారు. కానీ తన స్వశక్తితో నాకు తెలియకుండా దర్శకుడితో స్క్రీన్ టెస్ట్‌లో పాసైన తర్వాతే తనకు మా అబ్బాయి అని తెలిసింది. దర్శకుడితో కథ అంతా సిద్ధం చేయించుకున్న తర్వాతే నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుండి సినిమా షూట్ పూర్తయ్యే వరకు.. నేను ఒక్క షాట్ కూడా చూడలేదు. సినిమా పూర్తయిన తర్వాతే సినిమా చూడడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఈ సినిమా చూసిన తరువాత నాకు ఏమనిపించింది అంటే కొద్ది రోజులు పల్లెటూరులో ఉండాలనిపించింది. పల్లెటూరిలోని యువతను మంచి దారిలోకి ఎలా తీసుకొచ్చారు. ఫారిన్‌లో సెటిల్ అయిన వారిని పల్లెకు తీసుకొచ్చి మేము ఇక్కడే ఉంటాం.. ఇలాంటి మంచి వాతావరణాన్ని మేము మిస్సయ్యాము అనేటటువంటి బలమైన సీన్స్ ఇందులో ఉన్నాయి. సీనియర్ నటులెందరో ఈ చిత్రంలో నటించారు. వారితో మా అబ్బాయి నటించడం వలన తను ఎంతో నేర్చుకున్నాడు. ఫిబ్రవరి‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని అన్నారు.


హీరో రోహిత్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా జాబ్ మానేసి సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. మొదటి సినిమాలోనే సీనియర్ నటులతో నటించే ఇంతమంచి అవకాశం కల్పించిన తిరుమలరావుగారికి ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా చూసిన వారికి ఖచ్చితంగా వారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి..’’ అని అన్నారు.

Updated Date - 2022-01-10T03:30:33+05:30 IST