మిత్రమా.. అనే మీ పిలుపే చెవుల్లో మోగుతోంది : శేఖర్ కమ్ముల

తెలుగు సినీ సాహిత్య గగనాన.. తన పాటలతో సిరివెన్నెలలు కురిపించిన గీత రచయిత సీతారామశాస్త్రి. ఆయన మరణం సాహిత్యలోకానికి తీరని లోటు. ఎందరో సినీ ప్రముఖులకు ఆయనతో చెప్పలేని అనుబంధముంది. అలాగే.. ఆయన సాహిత్యాన్ని ఇష్టపడే దర్శకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ దర్శకత్వం వహించిన ‘అనామిక, ఫిదా’ చిత్రాలకు సిరివెన్నెల తన పాటలతో ప్రాణం పోశారు. ఆయన తిరిగిరాని లోకాలకి తరలి వెళ్ళిపోవడం ఆయన్ని ఎంతగానో బాధిస్తోంది. ఈ సందర్బంగా శేఖర్ కమ్ముల సిరివెన్నెలతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు.


‘నమ్మక తప్పని నిజమైనా

నువ్విక రావని చెబుతున్న

ఎందుకు వినదో నా మది ఇపుడైనా.. '

మీరు ఇక రారు అన్న fact ని accept చేయటానికి, ఇప్పుడు నా state of mind చెప్పటానికి కూడా మీ పాటే ఊతం అవుతోంది. మాటల్లో చెప్పలేని ఎన్ని emotions, feelings ని చెప్పటానికి మీ పాటల్ని తలుచుకుంటాం మేము!

‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ అని ప్రేమ తాలూకు మొదటి expression నుండి

Philosophy చూపులో

ప్రపంచమో బూటకం

Anatomy labలో

మనకు మనం దొరకం’; ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది..’ అని ఎన్నేసి చెప్పి వెళ్ళిపోయారు!

‘అడగాలనుంది ఒక డౌటుని,

సన్ రైజు లేని రోజేదని?

మరి ఎవ్రిడేని సండే అని,

అనుకుంటే తప్పు కాదా అని’ అని పిల్లల తరుపున అడిగే వారు,

‘ఓసారటువైపెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది...

 ఈ రైలుకి తన ఊరెపుడు గురుతురాదెలా..

కూ కూ బండి మా ఊరుంది

ఉండి పోవె మాతో పాటుగా

తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక..’ అని childhood nostalgia ని పాటల్లో భద్రంగా దాచి అందించేవారు ఇక ఎవ్వరు!?!

director - lyricist గా మనది అనామిక, ఫిదా అనే రెండు సినిమాల బంధం; మీ పాటకి నాకూ మూడు దశాబ్దాల అనుబంధం. మనసుకి కష్టంగా ఉంది సీతారామ శాస్త్రి గారు, ‘మిత్రమా’ అనే మీ పిలుపే చెవుల్లో మోగుతోంది... అంటూ శేఖర్ కమ్ముల సిరివెన్నెలకు అక్షర నివాళులర్పించారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.