Sekhar kammula : పవన్‌తో పొలిటికల్ మూవీ?

ABN , First Publish Date - 2021-10-16T21:01:40+05:30 IST

నిజానికి శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో ఓ సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవో కారణాలతో ఇంతవరకూ అది సాధ్యపడలేదు. ఈసారి ఎలాగైనా సరే ఆయనతో సినిమా తీసి.. అభిమానుల్ని అలరించేందుకు పట్టుదలగా రంగంలోకి దిగుతున్నారని టాక్. పవన్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ప్రసంగాలు, ఆయనలోని సేవాభావానికి ఫిదా అయిన శేఖర్ కమ్ముల పవర్ స్టార్ ను పొలిటికల్ పవర్ గా చూపించాలనుకోవడం ఆసక్తిని రేపుతోంది.

Sekhar kammula : పవన్‌తో పొలిటికల్ మూవీ?

సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీయడంలో చెయితిరిగిన శేఖర్ కమ్ముల.. రానాను హీరోగా ‘లీడర్’ అనే పొలిటికల్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఆయన సిన్సియర్ అటెంప్ట్ కి ప్రశంసలు దక్కాయి. అయితే మరోసారి శేఖర్ కమ్ముల రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2024 లో పవన్ కు పొలిటికల్ గా కలిసొచ్చే రీతిలో ఓ అద్భుతమైన స్టోరీతో శేఖర్ కమ్ముల భారీ స్థాయిలో సినిమా తెరకెక్కించబోతున్నారట. 2024 లో పవర్ స్టార్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఓ సినిమా తీసి.. విడుదల చేయాలన్నది శేఖర్ ప్లాన్. 



నిజానికి శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో ఓ సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవో కారణాలతో ఇంతవరకూ అది సాధ్యపడలేదు. ఈసారి ఎలాగైనా సరే ఆయనతో సినిమా తీసి.. అభిమానుల్ని అలరించేందుకు పట్టుదలగా రంగంలోకి దిగుతున్నారని టాక్. పవన్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ప్రసంగాలు, ఆయనలోని సేవాభావానికి ఫిదా అయిన శేఖర్ కమ్ముల పవర్ స్టార్ ను పొలిటికల్ పవర్ గా చూపించాలనుకోవడం ఆసక్తిని రేపుతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమా గానీ వస్తే,  అది నిజంగా పవన్‌కు ఫెచింగే అని చెప్పాలి. 

Updated Date - 2021-10-16T21:01:40+05:30 IST