ముక్కలు చేయాలనుకుంటే ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఏకం చేయాలనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’: సీతక్క
ABN , First Publish Date - 2022-03-30T00:14:07+05:30 IST
‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశమంతటా ఎక్కడ విన్నా ఇదే మాట. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి తెరకెక్కించిన ప్యాన్ ఇండియా చిత్రమిది. విడుదలైన రోజు నుంచి ఏరియాల్లో రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. అభిమానులు ప్రేక్షకులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ దేశమంతటా ఎక్కడ విన్నా ఇదే మాట. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి తెరకెక్కించిన ప్యాన్ ఇండియా చిత్రమిది. విడుదలైన రోజు నుంచి ఏరియాల్లో రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. అభిమానులు ప్రేక్షకులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క తన అనుచరులతో ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ఆమె ప్రశంసించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ఆమె విమర్శించారు.
‘‘దేశాన్ని విభజించాలనుకుంటే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూడండి.. ఏకం చేయాలనుకుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూడండి’’ అని సీతక్క ట్వీట్ చేశారు. సోదరులు తారక్, చరణ్ అద్భుతంగా నటించారని ఆమె చెప్పారు. దర్శకుడు రాజమౌళిని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.