ఈ ఫొటోల్లోని ఇద్దరూ వేర్వేరు కాదు.. ఒక్కరే.. డబ్బుంటే అందాన్ని కూడా మార్చొచ్చంటూ ఆ నటిపై ట్రోల్స్

ABN , First Publish Date - 2021-10-03T00:47:33+05:30 IST

వివాదాలకు మారు పేరుగా నిలిచే బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్. బాలీవుడ్‌లో విడుదలయ్యే సినిమాలు, సెలబ్రిటీలను ఎప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. బాహుబలి-2 రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా తప్పక పరాజయం పాలవుందని జోస్యం చెప్పారాయన.

ఈ ఫొటోల్లోని ఇద్దరూ వేర్వేరు కాదు.. ఒక్కరే.. డబ్బుంటే అందాన్ని కూడా మార్చొచ్చంటూ ఆ నటిపై ట్రోల్స్

వివాదాలకు మారు పేరుగా నిలిచే బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్. బాలీవుడ్‌లో విడుదలయ్యే సినిమాలు, సెలబ్రిటీలను ఎప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. బాహుబలి-2 రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా తప్పక పరాజయం పాలవుందని జోస్యం చెప్పారాయన. ఆయన తాజాగా ‘నాగిని’ బ్యూటీ మౌనీరాయ్‌పై విరుచుపడ్డారు. ఆమెను లక్ష్యంగా చేసుకొని వరుస ట్వీట్లు చేశారు. 


ఆమెకు సంబంధించిన పాత, కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని ఆరోపించారు. ‘‘డబ్బు అందాన్ని కూడా మారుస్తుంది. ఒక్కసారి మౌనీరాయ్ వంక చూడండి’’ అని ట్వీట్ చేశారు. నిజం చెప్పాలంటే వయసుతో  పాటు అందం కూడా తగ్గుతుంటుంది. కానీ, ఆ నటి వయసు పెరిగేకొద్ది యవ్వనంగా కనిపించడం మొదలైంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు ఆమె ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. 



Updated Date - 2021-10-03T00:47:33+05:30 IST