Raj Kundra - Shilpa Shetty: రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టికి ఊర‌ట‌!

ABN , First Publish Date - 2021-08-04T14:09:21+05:30 IST

న‌టి శిల్పాశెట్టికి.. ఇటీవ‌ల పోర్న్‌రాకెట్‌కేసులో అరెస్ట్ అయిన ఆమె భ‌ర్త రాజ్ కుంద్రాకు సెబీ కేసులో ఊర‌ట క‌లిగింది. వీరిద్ద‌రూ షేర్స్ వివ‌రాల‌ను లోబ‌డి వెల్ల‌డించ‌కుండా నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘించారంటూ..

Raj Kundra - Shilpa Shetty: రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టికి ఊర‌ట‌!

న‌టి శిల్పాశెట్టికి.. ఇటీవ‌ల పోర్న్‌రాకెట్‌కేసులో అరెస్ట్ అయిన ఆమె భ‌ర్త రాజ్ కుంద్రాకు సెబీ కేసులో ఊర‌ట క‌లిగింది. వీరిద్ద‌రూ షేర్స్ వివ‌రాల‌ను లోబ‌డి వెల్ల‌డించ‌కుండా నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘించారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై విచార‌లణ చేసిన సెబీ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే వారిద్ద‌రూ షేర్స్‌ను క‌లిగి ఉన్నారు కాబ‌ట్టి, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ పేర్కొంటూ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్లు తెలియజేసింది. వివ‌రాల్లోకెళ్తే రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2015లో 25.75 వాటా కోనుగోలుతో వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో ప్ర‌మోట‌ర్స్‌గా మారారు. త‌ర్వాత వీరికి కంపెనీ కొన్ని షేర్స్‌ను కేటాయించింది. 2013-15లో సెబీ వియాన్ ఇండ‌స్ట్రీస్ లావాదేవీల‌పై సెబీ విచార‌ణ ప్రారంభించింది. ఈకేసులో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి ప‌రిమితుల‌కు లోబ‌డే షేర్స్ ఉన్నారంటూ సెబీ అభిప్రాయప‌డింది. 

Updated Date - 2021-08-04T14:09:21+05:30 IST