BoycottLaalSinghChaddha: నెట్టింట వైరల్‌గా మారిన అతుల్ కులకర్ణి ట్వీట్.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పోస్ట్‌లు

ABN , First Publish Date - 2022-08-08T22:40:36+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కరీనా కపూర్ (Laal

BoycottLaalSinghChaddha: నెట్టింట వైరల్‌గా మారిన అతుల్ కులకర్ణి ట్వీట్.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పోస్ట్‌లు

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కరీనా కపూర్ (Laal Singh Chaddha), నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నెటిజన్స్ ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అందుకు కారణమేంటంటే.. 


గతంలో ఆమిర్ ఖాన్.. ‘‘భారత్‌లో అసహనం పెరిగిపోయింది. కొంత మంది చెడును కూడా వ్యాప్తి చేస్తున్నారు. నా భార్య కిరణ్ రావ్ ఈ దేశాన్ని విడిచి వెళ్దామని అడిగింది’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కరీనా కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నెపోటిజంపై అభిప్రాయం అడగగా..‘‘సినిమాలను వీక్షించమని మిమ్మల్ని ఎవరు బలవంతం చేయడం లేదు కదా’’ అని కరీనా స్పందించింది. దీంతో  కొంత మంది నెటిజన్స్ ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్‌కాట్ చేయాలని పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా స్క్రిఫ్ట్ రైటర్ అతుల్ కులకర్ణి (Atul Kulkarni) పాత ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ‘‘మత సంస్థలు నాస్తికత్వానికీ వ్యతిరేకం అని కచ్చితంగా నాకు తెలుసు. తర్వాతేంటి? నాస్తికులను నేరస్తులుగా పరిగణించాలని పిటిషన్ వేస్తారా’’ అని అతుల్ ట్వీట్ చేశాడు. అదే సమయంలో ఓ ట్విట్టర్ యూజర్‌కు రిప్లై ఇస్తూ.. ‘‘నేను హిందువు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు’’ అని అతడు ప్రశ్నించాడు. ఈ ట్వీట్స్ ఆధారంగా అతుల్‌ను హిందూ వ్యతిరేకిగా నెటిజన్స్ పరిగణిస్తున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తన సినిమాను బాయ్‌కాట్ చేయమని వరుసగా పెడుతున్న పోస్ట్‌లపై ఆమిర్ ఖాన్ స్పందించాడు. ‘‘నేను భారత్‌కు వ్యతిరేకి అని చాలా మంది భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్యాగ్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది’’ అని ఆమిర్ చెప్పాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. నాగచైతన్య ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 

Updated Date - 2022-08-08T22:40:36+05:30 IST