సైంటిఫిక్ థ్రిల్లర్ సింబా
ABN , First Publish Date - 2021-08-24T09:34:40+05:30 IST
మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం.. అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొనే సైంటిఫిక్ థ్రిల్లర్ ‘సింబా’. మనిషి అభివృద్ధి పేరుతో తనకు అండగా నిలిచిన ప్రకృతి గురించి మరచిపోతున్నాడు...

మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం.. అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొనే సైంటిఫిక్ థ్రిల్లర్ ‘సింబా’. మనిషి అభివృద్ధి పేరుతో తనకు అండగా నిలిచిన ప్రకృతి గురించి మరచిపోతున్నాడు. ముఖ్యంగా తన మనుగడకు కారణమవుతున్న చెట్లను నాశనం చేస్తున్నాడు. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ‘సింబా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది, రాజేంద్రర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. మురళీ మనోహరరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘సింబా’ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది. సినిమా టైటిల్, కాన్సెప్ట్ తదితర విషయాలను వివరిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. ‘ద ఫారెస్ట్ మ్యాన్’ అనే ట్యాగ్‌లైన్‌తో మంచి మెసేజ్‌తో, విజువల్ వండర్‌గా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి స్ర్కిప్ట్ అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు.