Satya Dev: కొత్త చిత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-26T18:58:27+05:30 IST

సత్య దేవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం అయింది. 'జ్యోతిలక్ష్మీ', 'బ్రోచేవారెవరురా', 'ఇస్మార్ట్ శంకర్' 'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటూ,

Satya Dev: కొత్త చిత్రం ప్రారంభం

సత్య దేవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం అయింది. 'జ్యోతిలక్ష్మీ', 'బ్రోచేవారెవరురా', 'ఇస్మార్ట్ శంకర్' 'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటూ, ఇండస్ట్రీ వర్గాల ఆదరాభిమానాలు పొందుతున్న యువ నటుడు సత్య దేవ్. ప్రస్తుతం ఆయన 'తిమ్మరుసు', అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.  


ఈ క్రమంలోనే సత్య దేవ్ హీరోగా మరో చిత్రం నేడు ( సెప్టెంబర్ 26 ) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాకి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇందులో నటించే హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారట.   



Updated Date - 2021-09-26T18:58:27+05:30 IST