రెక్కీ (Recce)పై దర్శకుడు వేగేష్న సతీష్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-06-17T03:04:41+05:30 IST

శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్, ఎస్టర్ నోరోన్హా, జీవా నటీనటులుగా కృష్ణ పోలూరి (Krishna Poluri) దర్శకత్వంలో కేవీ శ్రీరామ్ (KV Sriram) నిర్మాతగా.. జీ 5 నిర్మించిన నోవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రెక్కీ’ (Recce). జూన్17 నుండి..

రెక్కీ (Recce)పై దర్శకుడు వేగేష్న సతీష్ ప్రశంసలు

శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్, ఎస్టర్ నోరోన్హా, జీవా నటీనటులుగా కృష్ణ పోలూరి (Krishna Poluri) దర్శకత్వంలో కేవీ శ్రీరామ్ (KV Sriram) నిర్మాతగా.. జీ 5  నిర్మించిన నోవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రెక్కీ’ (Recce). జూన్17 నుండి ZEE5లో ఈ వెబ్ సిరీస్ స్క్రీనింగ్ మొదలవుతోంది. ఈ సందర్బంగా ఈ వెబ్ సిరీస్ సీజన్‌ను సెలబ్రిటీలకు, పాత్రికేయులకు జీ5 ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 


ఈ ప్రత్యేక షో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అతిథిగా హాజరైన దర్శకుడు వేగేష్న సతీష్ (Satish Vegesna) మాట్లాడుతూ.. ‘రెక్కీ’ ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏమవుతుందో అనే క్యూరియాటీని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. అందరూ కలిసి గ్రేట్ టీం వర్క్ చేశారు. ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ చాలా సీజన్స్ తీయాలి.. అని అన్నారు.


జీ5 చీఫ్ అనురాధ (AnuRadha) మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పినపుడు చాలా క్యూరియాసిటీగా అనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు మంచి క్యాస్ట్ అండ్ క్రూ కుదిరారు. ఓటీటీ అయినా, సినిమా అయినా సేమ్ కంటెంట్ ఉంటుంది. దర్శకుడు కృష్ణ పోలూరి మేము అనుకున్న దాని కన్నా చాలా చక్కగా తీశారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 17 నుండి ZEE5 లో ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌‌లో 1990ల నాటి గ్రిప్పింగ్ పీరియడ్ థ్రిల్లర్ కథ. 7 ఎపిసోడ్‌ల వ్యవధిలో ఒక్కొక్కటి 25 నిమిషాలు నిడివి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతి ఒక్కరికీ ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది. జీ5 వీక్షకులకు ఎప్పటి కప్పుడు కొత్త కంటెంట్ తో కొత్త వెబ్ సిరీస్‌ లతో అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని తెలిపారు.


చిత్ర నిర్మాత కె. వి శ్రీరామ్ (KV Sriram) మాట్లాడుతూ.. అనురాధగారు ట్యాలెంట్ ఉన్న వారిని హంట్ చేసి మరి సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వారే శ్రీకాంత్ పోలూరు. ఆమె దర్శకుడిని, నన్ను నమ్మి.. మాతో ఈ ప్రాజెక్ట్ చేయించారు. అందుకు తగ్గట్టే దర్శకుడు కృష్ణ పోలూరి చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం టీం ఎఫర్ట్. అందరూ ఎంతో కష్టపడ్డారు. దర్శకుడు అనిల్ రావిపూడిగారు మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తీశారు అని మెచ్చుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ZEE5 వారికి ధన్యవాదాలు.. అన్నారు.


దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ రెక్కీ  ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ చాలా బాగా వచ్చింది. ఈ రెక్కీ వెబ్ సిరీస్, చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సబ్జెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన జీ5 అనురాధగారికి, నిర్మాత శ్రీరామ్ కొలిశెట్టిలకు ధన్యవాదాలు.. అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, శివబాలాజీ, నటి ఎస్టర్ నోరోన్హా, నటి మధుమిత వంటి వారు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.

Updated Date - 2022-06-17T03:04:41+05:30 IST