శర్వానంద్‌కు మిగిలిన ఒకే ఒక ఆశ

ABN , First Publish Date - 2022-03-14T16:40:05+05:30 IST

ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శతమానం భవతి, మహానుభావుడు లాంటి చిత్రాలతో నిర్మాతలకు పాతిక కోట్ల బడ్జెట్ పెట్టేంత భరోసా కల్పించాడు. అయితే గత కొంతకాలంగా.. శర్వానంద్ వరుస ఫ్లాపులు చవిచూస్తూ .. తన మార్కెట్ అంతా పోగొట్టుకున్నాడు. అతడి తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చాలా పూర్ కలెక్షన్స్ తెచ్చుకొని డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఈ పరిస్థితుల్లో అతడు బాగా పేరున్న సంస్థల్లో అవకాశాలు అందుకోవడం కష్టంగా మారింది. అలాగే చర్చల్లో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడికున్న ఒకే ఒక ఆశగా.. ‘ఒకే ఒక జీవితం’ చిత్రం కనిపిస్తోంది.

శర్వానంద్‌కు మిగిలిన ఒకే ఒక ఆశ

ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శతమానం భవతి, మహానుభావుడు లాంటి చిత్రాలతో నిర్మాతలకు పాతిక కోట్ల బడ్జెట్ పెట్టేంత భరోసా కల్పించాడు. అయితే గత కొంతకాలంగా.. శర్వానంద్ వరుస ఫ్లాపులు చవిచూస్తూ .. తన మార్కెట్ అంతా పోగొట్టుకున్నాడు. తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చాలా పూర్ కలెక్షన్స్ తెచ్చుకొని డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఈ పరిస్థితుల్లో అతడు బాగా పేరున్న సంస్థల్లో అవకాశాలు అందుకోవడం కష్టంగా మారింది. అలాగే చర్చల్లో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.  ఈ నేపథ్యంలో అతడికున్న ఒకే ఒక ఆశగా.. ‘ఒకే ఒక జీవితం’ చిత్రం కనిపిస్తోంది. 


బేసిగ్గా ఓ తమిళ చిత్రం ఆధారంగా ‘ఒకే ఒక జీవితం’ మూవీ  రూపొందుతోంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తమిళ టాప్ ప్రొడ్యూసర్ యస్.ఆర్. ప్రభు నిర్మించాడు.  టైమ్ ట్రావెల్ కథాంశంతో .. విభిన్నమైన స్ర్కీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అమల అక్కినేని కీలక పాత్ర పోషించారు.  మొన్నా మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. అలాగే కథాంశం కూడా ఎంతో కొత్తగా కనిపించింది. వేసవిలో విడుదల కాబోతున్న ఈ సినిమాతో అయినా శర్వానంద్ తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. 

Updated Date - 2022-03-14T16:40:05+05:30 IST