Sarkaru vaari paata : హైలైట్ కానున్న బీచ్ ఫైట్

ABN , First Publish Date - 2022-01-19T18:04:40+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కరోనా బారిన పడిన కారణంగా వాయిదా పడింది. రీసెంట్ గా తాను కరోనా నుంచి కోలుకున్నట్టు కీర్తి సురేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ కూడా కోలుకుంటే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకే హైలైట్ అనదగ్గ స్థాయిలో ఓ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట.

సినిమాలో ఇదే మేజర్ ఫైట్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. దుబాయ్ లోని ఓ ఫేమస్ బీచ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ ఫైట్ ను చిత్రీకరించారట. అలాగే మరికొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా దుబాయ్ లో షూట్ చేశారని సమాచారం. లాస్టియర్ రవితేజ ‘క్రాక్’ మూవీలో వేటపాలెం బీచ్ లో తీసిన ఫైట్ సీక్వెన్స్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అదే ఇంటెన్సిటీతో ‘సర్కారువారి పాట’ లోని బీచ్ ఫైట్ ఉండబోతోందట. సంక్రాంతి బరి నుంచి ఏప్రిల్ 1 కి రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా.. అప్పుడు కూడా రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అదే రోజున మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాని కూడా విడుదల చేస్తున్నారు. మరి ‘సర్కారువారి పాట’ చిత్రం కూడా అదే రోజున వస్తుందా లేక వేరే రిలీజ్ డేట్ తో వస్తుందా? అనేది వేచి చూడాలి. 

Updated Date - 2022-01-19T18:04:40+05:30 IST