Sarkaru vaari paata: అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం అప్‌డేట్ ఇచ్చింది. అందరూ ఈ పండుగ సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న అనివార్య కారణాల వల్ల ఈ సంక్రాంతికి ఇస్తామన్న మ్యూజికల్ అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నాం అని తెలిపారు. అలాగే, ఈ మూవీ అప్‌డేట్‌కు సంబంధించి త్వరలోనే తెలియజేస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఇదే సందర్భంగా అభిమానులకి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి.. సేఫ్‌గా ఉండమని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సంక్రాంతి పండుగకి 'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదని క్లారిటీ వచ్చేసింది. కాగా, కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ - 14 రీల్స్ - మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.