‘సర్దార్‌’ సన్నద్ధం

ABN , First Publish Date - 2022-06-29T05:43:37+05:30 IST

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌’. పిఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాత...

‘సర్దార్‌’ సన్నద్ధం

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌’. పిఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్డూడియోస్‌ పతాకంపై నాగార్జున విడుదల చేస్తున్నారు. రజిషా విజయన్‌, చుంకీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. ‘‘అభిమన్యుడు చిత్రంతో మిత్రన్‌ మంచి పేరు తెచ్చుకొన్నారు. దాంతో.. ‘సర్దార్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని తప్పకుండా మా చిత్రం అందుకుంటుంద’’ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2022-06-29T05:43:37+05:30 IST