విజయ్ దేవరకొండ‌తో ఆ సినిమా రీమేక్‌లో నటించాలనుంది: సారా అలీ ఖాన్

ABN , First Publish Date - 2021-12-31T22:11:14+05:30 IST

ఈ ఏడాది సారా అలీఖాన్‌కు బాగా కలిసొచ్చింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘‘ అత్రాంగి రే’’ సినిమా అభిమానుల మదిని దోచింది.

విజయ్ దేవరకొండ‌తో ఆ సినిమా రీమేక్‌లో నటించాలనుంది: సారా అలీ ఖాన్

ఈ ఏడాది సారా అలీఖాన్‌కు బాగా కలిసొచ్చింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘‘ అత్రాంగి రే’’  సినిమా అభిమానుల మదిని దోచింది. ఈ చిత్రంలో రింకు అనే పాత్రను పోషించింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించారు. ధనుష్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో  ఆమె నటనకు అభిమానులందరూ ఫిదా అయ్యారు. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 


కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘‘ కుచ్ కుచ్ హోతా హై ’’ రీమేక్‌లో నటించాలని ఉందని ఆమె చెప్పింది. ఆ రీమేక్‌‌ను విజయ్ దేవరకొండ, జాన్వీకపూర్‌లతో చేయాలనుందని స్పష్టం చేసింది. జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ‌లతో ఏ సినిమాలో నటిస్తారని  అడగగా ఆమె సమాధానమిచ్చింది. ‘‘ కరణ్ జోహార్ తెరకెక్కిస్తే ‘ కుచ్ కుచ్ హోతా హై’ రీమేక్‌లో వీరందరితో కలిసి నటిస్తాను. జాన్వీ, విజయ్ కూడా ఈ సినిమా చేయడానికి తప్పకుండా ఆసక్తి చూపిస్తారు ’’ అని సారా అలీఖాన్ చెప్పింది.  


విజయ్ దేవరకొండ హాట్‌గా ఉంటాడని ఒక ఇంటర్వ్యూలో  సారా అలీ ఖాన్ గతంలోనే చెప్పింది. ముంబైలో ‘లైగర్’ చిత్రీకరణ సందర్భంగా రౌడీభాయ్‌తో సెల్ఫీని  కూడా తీసుకుంది.

Updated Date - 2021-12-31T22:11:14+05:30 IST