కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లిలో డ్యాన్స్.. Sara Ali Khan ఏమందో తెలుసా..

ABN , First Publish Date - 2021-12-06T19:07:55+05:30 IST

బాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు సారా అలీఖాన్. పటౌడీ కుటుంబంలో నటులు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌కి పుట్టిన ఈ బ్యూటీ తదనానంతరం ఇండస్ట్రీకి పరిచయమైంది.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లిలో డ్యాన్స్.. Sara Ali Khan ఏమందో తెలుసా..

బాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు సారా అలీఖాన్. పటౌడీ కుటుంబంలో నటులు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌కి పుట్టిన ఈ బ్యూటీ తదనానంతరం ఇండస్ట్రీకి పరిచయమైంది. కేవలం నాలుగు సినిమాలతోనే ఆడియన్స్ మనసులు కొల్లగొట్టి.. సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు పొందింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ తార అక్కడ కూడా మంచి ఫాలోయింగ్‌నే సంపాదించుకుంది.


ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన స్టార్ కిడ్స్‌లో నిస్సందేహంగా సారా అలీ ఖాన్ ఒకరు. అందుకే ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా మంచి అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘అత్రంగి రే’. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడింది.


అందులో.. ఈ సినిమాలోని ‘చకా చక్’ సాంగ్ మంచి టాక్ సొంతం చేసుకుంది. అది మంచి పెళ్లికి సంబంధించిన సాంగ్. ‘ఈ పాటకి విక్కీ, కత్రినా  పెళ్లిలో డ్యాన్స్ వేస్తారా? అని అడగగా.. సారా బిగ్గరగా నవ్వుతూ.. ‘ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేన’ని చెప్పింది.


పెళ్లి గురించి కత్రినా గానీ, విక్కీ గానీ అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. అందుకే వారి విషయాలను బయట పెట్టడానికి ఇష్టం లేని సారా అందుకే అలా అంది. కాగా సారా ప్రస్తుతం ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే సినిమా చేస్తోంది.



Updated Date - 2021-12-06T19:07:55+05:30 IST