Sara Ali Khan: అది మాత్రం మరవకు.. పుట్టినరోజు తనకు తానే సందేశం ఇచ్చుకున్న బ్యూటీ

ABN , First Publish Date - 2022-08-12T17:52:37+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సారా అలీఖాన్ (Sara Ali Khan) ఒకరు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా..

Sara Ali Khan: అది మాత్రం మరవకు.. పుట్టినరోజు తనకు తానే సందేశం ఇచ్చుకున్న బ్యూటీ

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సారా అలీఖాన్ (Sara Ali Khan) ఒకరు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘కేదార్‌నాథ్’ సైఫ్ అలీఖాన్(Saif AliKhan) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. అనంతరం వరుసగా స్టార్లతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది. ఈ రోజు(ఆగస్టు 12)న సారా 27వ పుట్టినరోజు (Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ తనకు తానే సోషల్ మీడియాలో మేస్సేజ్ ఇచ్చుకుంది.


ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సారా ముంబైలోని ఓ జిమ్‌లో ఉన్న పిక్‌ని షేర్ చేసింది. దానికి.. ‘హ్యాపీ బర్త్ డే సారా.. ఎల్లప్పుడూ నిన్ను నువ్వు ప్రేమించుకో.. అలాగే.. మీ శరీరం, మనస్సు, ఆత్మ కోసం వ్యాయామం చేయడం మర్చిపోకండి’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఎంతోమంది ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సారా ప్రస్తుతం విక్కీ కౌశల్‌లో కలిసి ఓ సినిమా, ఆమె ప్రధానపాత్రలో ‘గ్యాస్ లైట్’ అనే ఓ సినిమా చేస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలు సైతం సారా చేతిలో ఉన్నాయి.



Updated Date - 2022-08-12T17:52:37+05:30 IST