సప్తగిరి కొత్త సినిమా.. దర్శకుడు ఎవరంటే!

ABN , First Publish Date - 2022-01-18T21:32:43+05:30 IST

సప్తగిరి హీరోగా ‘యజ్ఞం’, ‘పిల్లా... నువ్వులేని జీవితం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. రిగ్వేద క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎస్‌. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

సప్తగిరి కొత్త సినిమా.. దర్శకుడు ఎవరంటే!

సప్తగిరి హీరోగా ‘యజ్ఞం’, ‘పిల్లా... నువ్వులేని జీవితం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. రిగ్వేద క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎస్‌. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్‌. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ ‘‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంసినిమాకు బలం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, పోరాటాలు: రామ్‌ – లక్ష్మణ్‌, కెమెరా: సిద్థం మనోహర్‌, కళ: రమణ వంక, పాటలు: సుద్దాల అశోక్‌ తేజ, కళ్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని, సహ నిర్మాత: దేవినేని రవి. 


Updated Date - 2022-01-18T21:32:43+05:30 IST