ప్రభాస్‌ సినిమాలో సంజయ్‌దత్‌

ABN , First Publish Date - 2022-09-26T06:31:06+05:30 IST

‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు...

ప్రభాస్‌ సినిమాలో సంజయ్‌దత్‌

‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈపాటికే మారుతి చిత్రం పట్టాలెక్కాలి. కానీ... ప్రభాస్‌ బిజీ షెడ్యూల్‌ వల్ల వీలు కాలేదు. ఎట్టకేలకు మారుతి సినిమాకి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. నవంబరులో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కథ సిద్ధమైందని టాక్‌. ఓ కీలకమైన పాత్ర కోసం సంజయ్‌దత్‌ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్‌ సినిమా అంటే.. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలోనే తీయాలి. దానికి తగ్గట్టుగానే నటీనటుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సంజయ్‌దత్‌ను సంప్రదించారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌ 2’లో సంజయ్‌ మెరిశాడు. తన స్ర్కీన్‌ ప్రెజెన్స్‌ బాగా నచ్చింది. ఆ సినిమా విజయంలో సంజయ్‌ పాత్ర కీలకంగా మారింది. హిందీ బెల్ట్‌లో ‘కేజీఎఫ్‌ 2’ భారీ వసూళ్లు సంపాదించడానికి సంజయ్‌ ఓ ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు మారుతి సినిమా కోసం కూడా తనని బరిలోకి దించాలని భావిస్తున్నారు. 


Updated Date - 2022-09-26T06:31:06+05:30 IST