KGF 2 : దర్శకనిర్మాతలు వద్దన్నారు... ‘అధీర’ ససేమీరా అన్నాడు!

ABN , First Publish Date - 2022-01-14T04:11:16+05:30 IST

‘కేజీఎఫ్ 2’ సినిమాలో విలన్ ‘అధీర’గా అలరించనున్నాడు సంజయ్ దత్. అయితే, మచ్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీలో ఆయన హై ఇంటెన్సిటి యాక్షన్ సీన్స్‌లో నటించాడట. నిజానికి ‘కేజీఎఫ్ 2’ దర్శకనిర్మాతలు సంజు బాబాని రిస్క్ చేయొద్దన్నారట. కొన్ని మీడియా కథనాల ప్రకారం ‘కేజీఎఫ్’ టీమ్ ఆయన్ని బాడీ డబుల్ వాడమని కోరినట్టు తెలుస్తోంది.

KGF 2 : దర్శకనిర్మాతలు వద్దన్నారు... ‘అధీర’ ససేమీరా అన్నాడు!

‘కేజీఎఫ్ 2’ సినిమాలో విలన్ ‘అధీర’గా అలరించనున్నాడు సంజయ్ దత్. అయితే, మచ్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీలో ఆయన హై ఇంటెన్సిటి యాక్షన్ సీన్స్‌లో నటించాడట. నిజానికి ‘కేజీఎఫ్ 2’ దర్శకనిర్మాతలు సంజు బాబాని రిస్క్ చేయొద్దన్నారట. కొన్ని మీడియా కథనాల ప్రకారం ‘కేజీఎఫ్’ టీమ్ ఆయన్ని బాడీ డబుల్ వాడమని కోరినట్టు తెలుస్తోంది. 


బాలీవుడ్ ‘ఖల్‌నాయక్’ వయస్సు, ఆరోగ్యం రిత్యా ‘కేజీఎఫ్’ ఫిల్మ్ మేకర్స్ డూప్‌ని వాడి ఫైట్ సీన్స్ పిక్చరైజ్ చేయాలని భావించారట. అదే ఆయనతో చెప్పారట కూడా. కానీ, మన మున్నాభాయ్ ససేమీరా అన్నట్లు ముంబై టాక్. తాను స్వయంగా యాక్షన్‌లోకి దిగకపోవతే ‘అధీర’ క్యారెక్టర్‌లో ఒరిజినాలిటి లోపిస్తుందని సంజయ్ ఫీలయ్యాడట. అందుకే, ఎంతో కష్టమైన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా స్వంతంగా కెమెరా ముందు చేశాడని చెబుతున్నారు. చూడాలి మరి, ఆ మధ్య క్యాన్సర్ కారణంగా విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన సీనియర్ స్టార్ ‘కేజీఎఫ్ 2’లో ఎలాంటి రిస్క్ చేశాడో... సినిమా విడుదలైతేగానీ తెలియదు... 

Updated Date - 2022-01-14T04:11:16+05:30 IST