Welcome back Daddy.. బాబు పుట్టాడంటూ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్

ABN , First Publish Date - 2021-09-25T00:20:48+05:30 IST

రియాలిటీ షో రోజుల నుంచి సాండీ అభిమానుల హృదయాలను గెల్చుకుంటునే ఉన్నారు. అనంతరం అతడు డ్యాన్సర్‌గా మారారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్‌గా మారి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Welcome back Daddy.. బాబు పుట్టాడంటూ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్

చెన్నై: రియాలిటీ షో రోజుల నుంచి సాండీ అభిమానుల హృదయాలను గెల్చుకుంటునే ఉన్నారు. అనంతరం అతడు డ్యాన్సర్‌గా మారారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  కొరియోగ్రాఫర్‌గా మారి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తమిళ్ బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొని పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ షోలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. 


డోరతీ సిల్వియా అనే తన ప్రేమికురాలిని 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమార్తె జన్మించింది. ఆమెకు లాల అని పేరు పెట్టారు. డోరతీ జులై 22న కుమారుడికి జన్మనిచ్చింది. ‘‘ మా డాడీ తిరిగి జన్మించారు ’’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకున్నారు. ఆ దంపతులు ప్రస్తుతం తమ బాబు పేరును ప్రకటించారు. ఆ బాబు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ బాబుకు ఎస్‌డి. షాన్ మైకేల్‌గా పేరు పెట్టామన్నారు.



 సాండీ తన సోషల్ మీడియాలో.. ‘‘ నా ప్రియమైన రాజు ఎస్‌డి. షాన్ మైకేల్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటివరకు మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు. మీరు ఇలాగే దీవెనలు అందించండి ’’అని చెప్పారు. సాండీ ప్రస్తుతం ‘333’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయనకు హీరోగా మొదటి చిత్రమిది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ‘‘ కథువాకుల్ రెండు కాదల్ ’’ చిత్రంలోని ‘‘ టుటుటు’’ పాటకు నృత్యరీతులు సమకూర్చారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2021-09-25T00:20:48+05:30 IST