సందీప్‌ కోసం రంగంలో దిగిన వరలక్ష్మీ!

ABN , First Publish Date - 2022-01-20T23:27:24+05:30 IST

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్‌’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, కరణ్‌ సీ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్‌ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ ేసతుపతి కీలక పాత్రలో కనిపిస్తారు. దివ్యాంక కౌశిక్‌ నటిస్తున్నారు.

సందీప్‌ కోసం రంగంలో దిగిన వరలక్ష్మీ!

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్‌’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, కరణ్‌ సీ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్‌ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ ేసతుపతి కీలక పాత్రలో కనిపిస్తారు. దివ్యాంక కౌశిక్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించనున్నారని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ మొదలుపెడతారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ సమర్పణలో భరత్‌చౌదరి,  పూస్కుర్‌ రామ్మోహన్‌ రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Updated Date - 2022-01-20T23:27:24+05:30 IST