ధనుష్ సినిమాలో సందీప్ కిషన్
ABN , First Publish Date - 2022-09-18T06:01:47+05:30 IST
ధనుష్ నటిస్తున్న పిరియాడికల్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు....

ధనుష్ నటిస్తున్న పిరియాడికల్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.శరవణన్, సాయి సిద్దార్థ్ నిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం సందీప్ కిషన్‌ని ఎంచుకొన్నారు. తెలుగులో ధనుష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సందీప్ కిషన్‌కి సైతం తమిళంలో చక్కటి గుర్తింపు ఉంది. అందుకే ఈ కాంబో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. 1930 - 1940 మధ్య జరిగే కథ ఇది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇందులో సందీప్ కిషన్ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు దర్శకుడు.