ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య సందేశాలు.. హీరోయిన్‌ ఫిర్యాదు

‘అంబులి’ వంటి పలు చిత్రాల్లో నటించిన సనమ్‌ షెట్టి ‘బిగ్‌బాస్‌-4’ రియాల్టీ షోలో పాల్గొని బిగ్‌బాస్‌ హౌస్‌లో అలజడి సృష్టించింది. తద్వారా బోలెడంతమంది అభిమానులను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా పెద్దగా సినీ అవకాశాలు లేవు. కానీ, ఈ మధ్యకాలంలో ఆమెను వెతుక్కుంటూ కొత్త ఆఫర్లు వస్తున్నాయి. వీటిలో మంచి కథ కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ ముందుకుసాగిపోతోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సనమ్‌కు ఓ అగంతకుడు తేరుకోలేని షాకిచ్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అసభ్య కామెంట్స్‌తో పాటు అశ్లీల ఫొటోలను పోస్టు చేస్తున్నాడు. దీంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. తనకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్న ఆ అకతాయి ఆటలు కట్టించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి తగిన ఆధారాలను కూడా ఆమె సైబర్‌ క్రైమ్‌కు సమర్పించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.