ధనుష్ సినిమా నుంచి మల్లూ బ్యూటీ తప్పుకుందా?

ABN , First Publish Date - 2022-01-11T18:19:50+05:30 IST

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. తమిళంలో ఇదే చిత్రాన్ని ‘వాత్తి’గా విడుదల చేస్తున్నారు. అలాగే హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఒక లెక్చరర్ కి, స్టూడెంట్స్ కు మధ్యనున్న రిలేషన్ ను ఈ సినిమాతో చాలా అందంగా ప్రెజెంట్ చేయబోతున్నాడట దర్శకుడు. ధనుష్ లెక్చరర్ గా నటిస్తుండడం విశేషం.

ధనుష్ సినిమా నుంచి మల్లూ బ్యూటీ తప్పుకుందా?

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్  నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. తమిళంలో ఇదే చిత్రాన్ని ‘వాత్తి’గా విడుదల చేస్తున్నారు. అలాగే హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఒక లెక్చరర్ కి, స్టూడెంట్స్ కు మధ్యనున్న రిలేషన్ ను ఈ సినిమాతో చాలా అందంగా ప్రెజెంట్ చేయబోతున్నాడట దర్శకుడు. ధనుష్ లెక్చరర్ గా నటిస్తుండడం విశేషం.  ఇందులో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా ఖాయం చేస్తూ సినిమా లాంఛింగ్ రోజునే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆమె సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 


సంయుక్త మీనన్ ఆల్రెడీ  పవర్ స్టార్  ‘భీమ్లా నాయక్’ చిత్రంలో రానా భార్యగా నటిస్తోంది. ఆ క్రెడిట్ తోనే ఆమెను ధనుష్ కథానాయికగా ఎంపిక చేశారు. మరి కారణాలేంటో తెలియదు కానీ ఆమె ఈ సినిమా నుంచి ఔట్ అయిందని అంటున్నారు. నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే.. ఆమె ప్లేస్ లో ఎవరిని కథానాయికగా ఎంపిక చేశారు అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-01-11T18:19:50+05:30 IST