టాలీవుడ్‌లోకి మరో మలయాళ బ్యూటీ!

ABN , First Publish Date - 2021-08-08T01:14:31+05:30 IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కంటే పర భాషా హీరోయిన్స్‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ వ‌రుస‌లో మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్‌లోకి మరో మలయాళ బ్యూటీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కంటే పర భాషా హీరోయిన్స్‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇటు కోలీవుడ్‌, మల్లువుడ్‌తో పాటు అటు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ వ‌రుస‌లో మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో తెలుసా? సంయుక్త మీన‌న్‌. మ‌ల‌యాళ‌, త‌మిళ సినిమాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు ఇప్పటికే తెలుగులో క‌ళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా పూర్తి కాక ముందే సాయితేజ్ సినిమాకు సైన్ చేసింద‌ట‌. సుకుమార్ రైటింగ్స్‌, బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌రి ఈమె ఇప్ప‌టికే రేసులో ఉన్న ఇత‌ర హీరోయిన్స్‌కు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి మ‌రి. 

Updated Date - 2021-08-08T01:14:31+05:30 IST