Chiranjeevi: చిరంజీవి సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని!

ABN , First Publish Date - 2021-07-20T15:09:59+05:30 IST

ద‌ర్శ‌కత్వం నుంచి న‌టుడిగా మారిన త‌ర్వాత స‌ముద్ర‌ఖ‌ని ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగు, త‌మిళ సినిమా అవ‌కాశాల‌తో తీరిక లేకుండా ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో ...

Chiranjeevi: చిరంజీవి సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని!

ద‌ర్శ‌కత్వం నుంచి న‌టుడిగా మారిన త‌ర్వాత స‌ముద్ర‌ఖ‌ని ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగు, త‌మిళ సినిమా అవ‌కాశాల‌తో తీరిక లేకుండా ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్, రానా చేస్తున్న అయ్య‌ప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌, మ‌హేశ్ స‌ర్కారువారి పాట చిత్రాల్లో న‌టిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు చిరంజీవి 153వ చిత్రంగా రూపొంద‌నున్న లూసిఫ‌ర్ రీమేక్‌లోనూ న‌టించ‌బోతున్నారట‌. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడిగా రూపొందనున్న‌ మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్ష‌కుల నెటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, చేర్పులు చేసి సినిమాను రూపొందిస్తున్నారు. మ‌రి తెలుగు రీమేక్‌లో స‌ముద్ర‌ఖ‌ని ఎలాంటి పాత్ర చేయ‌నున్నాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

Updated Date - 2021-07-20T15:09:59+05:30 IST