Sammathame ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2022-07-07T19:05:16+05:30 IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సమ్మతమే' (Sammathame).

Sammathame ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సమ్మతమే' (Sammathame). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జూన్ 24న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల మంచి కథలతో వచ్చి పాపులారిటీ తెచ్చుకుంటున్న కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' చిత్రంతో ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది.


'సమ్మతమే' మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' దక్కించుకుంది. ఈ నేపథ్యంలో జూలై 15న ఈ చిత్రాన్ని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధం చేస్తోంది. జూలై 15 నుంచి ఆహాలో 'సమ్మతమే' స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందివ్వగా, యూజీ క్రియేషన్స్ వారు నిర్మించారు. 


పెళ్లి తర్వాత కట్టుకున్న భార్యను ప్రేమించాలని ఎదురు చూస్తూ.. తనకు కాబోయే భార్య తనతో పెళ్ళికి ముందు ఎవరితోనూ ప్రేమలో పడకూడదని ఆశిస్తున్నా ఓ యువకుడికి... అంతకముందే ఒకరిని ప్రేమించిన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అనే ఆసక్తికరమైన కథాంశంతో సినిమాను రూపొందించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. మరి సమ్మతమే ఓటీటీ వీక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.  



Updated Date - 2022-07-07T19:05:16+05:30 IST