బన్నీ వల్లే నేను ఊ.. అన్నాను : సమంత

ABN , First Publish Date - 2022-01-12T18:26:43+05:30 IST

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ అనే ఐటెమ్ సాంగ్ తో సమంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ క్యాచీ ట్యూన్ లో చంద్రబోసు సాహిత్యం పెర్ఫెక్ట్ గా ఇమిడిపోవడంతో జనంలోకి దూసుకుపోయింది పాట. యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంది . దీంతో సామ్ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇతర భాషల్లోనూ ఆ పాట ఇదే స్థాయిలో సూపర్ హిట్టైంది. సామ్ గ్రేస్ స్టెప్స్, బన్నీ స్టైలిష్ మూమెంట్స్ తో భలేగా సింకవడంతో పాట ఓ రేంజ్ లో పేలిపోయింది.

బన్నీ వల్లే నేను ఊ.. అన్నాను : సమంత

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ అనే ఐటెమ్ సాంగ్ తో సమంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ క్యాచీ ట్యూన్లో చంద్రబోసు సాహిత్యం పెర్ఫెక్ట్ గా ఇమిడిపోవడంతో జనంలోకి దూసుకుపోయింది పాట. యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంది . దీంతో సామ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.  సామ్ గ్రేస్ స్టెప్స్, బన్నీ స్టైలిష్ మూమెంట్స్ తో భలేగా సింకవడంతో పాట ఓ రేంజ్ లో పేలిపోయింది. తనున్న పరిస్థితుల్లో ఇలాంటి పాట చేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు బన్నీకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయింది సామ్. 


ఊ.. అంటావా సాంగ్ సామ్ కెరీర్ లోనే మొదటి ఐటెమ్ సాంగ్. హీరోయిన్ గా స్టార్ స్టాటస్ ను కొనసాగిస్తున్న తాను ఈ సాంగ్ లో నర్తించాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో పడిందట సమంత. అందుకే తాను ఈ పాటను చేయడానికి ముందుగా అంగీకరించలేదట. అల్లు అర్జున్ ప్రేరణ వల్లనే తాను ఈ పాటలో నర్తించానని అంటోంది సామ్. ఈ పాట తనకి బ్రహ్మాండమైన పేరు తెచ్చిపెడుతుందని తనకి హామీ ఇచ్చిన అతడికి కృతజ్ఞతలు తెలిపింది సామ్. పాట ఎలా ఉంటుందోనని భయపడి నేను వెనకడుగు వేశాను.అప్పుడు బన్నీ నన్ను కూర్చోబెట్టి సాంగ్ ఎలా ఉంటుందో వివరించి చివరికి ఒప్పించాడు. ఆయన ప్రోత్సాహం లేకుంటే ‘ఊ.. అంటావా’ పాటకి తాను ఉఊ.. అనేదాన్ని  అని సామ్ చెప్పింది. 

Updated Date - 2022-01-12T18:26:43+05:30 IST