Samantha : విడాకుల త‌ర్వాత తొలి సారి నోరు విప్పిన స‌మంత‌..ఏం చెప్పిందంటే..!

ABN , First Publish Date - 2021-12-07T18:46:03+05:30 IST

అక్కినేని నాగ చైతన్య తర్వాత ఇన్నాళ్ళకు సమంత నోరు విప్పి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన సమంత..ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో

Samantha : విడాకుల త‌ర్వాత తొలి సారి నోరు విప్పిన స‌మంత‌..ఏం చెప్పిందంటే..!

అక్కినేని నాగ చైతన్య తర్వాత ఇన్నాళ్ళకు సమంత నోరు విప్పి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన సమంత..ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన కోటేషన్స్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇలా తన ఇన్స్టాగ్రాం లో పోస్ట్ పెట్టిన ప్రతీసారి నెటిజన్స్ దాన్ని హైలెట్ చేస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు సామ్ మానసికంగా కృంగిపోయింది కూడా. అయినా ఇప్పటివరకు విడాకులకు సంబంధించిన విషయంలో మాట్లాడలేదు. అయితే, తాజాగా ఎల్లే (ELLE) మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాటాడింది. 'నేను షరతులు లేని అంగీకారాన్ని డిమాండ్ చేయను. భిన్న అభిప్రాయాలు కలిగి ఉండాలని నేను అందరినీ ప్రోత్సహిస్తాను. అయితే, మనం ఒకరినొకరం ప్రేమించుకోవచ్చు అలాగే కరుణించవచ్చు. కాకపోతే, వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తాను'.. అని సమంత చెప్పుకొచ్చింది. ఇక 2021లో సమంత ఎన్నో ప్లాన్ వేసుకున్నప్పటికీ అవన్నీ తలకిందులైనట్టు సమంత అభిప్రాయపడింది. ఇదే సమయంలో చైతూతో విడిపోయిన తర్వాత తనపై వచ్చిన రూమర్స్, ట్రోలింగ్ పట్ల ఎంతో మనోవేదనకు గురైనట్టు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది.   

Updated Date - 2021-12-07T18:46:03+05:30 IST