చై–సామ్‌ మాటలు సోషల్‌ మీడియాలోనేనా?

హీరోహీరోయిన్లు భార్యభర్తలైతే ఆ క్రేజ్‌ వేరుగా ఉంటుంది. వారి ప్రేమానురాగాలను బహిరంగంగా ప్రదర్శించుకుంటారు. కొన్నేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంతో ఒకటైన టాలీవుడ్‌లో ప్రేమపక్షలు నాగచైతన్య, సమంత సోషల్‌ మీడియా వేదికగా ఎన్నోసార్లు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సామ్‌–జామ్‌, ఇతర షోల్లోనూ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. ఇద్దరు కలిసి వర్కవుట్స్‌ చేసిన వీడియోలు, సామ్‌ కోసం చై చేసిన స్పెషల్‌ వంటకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకరి సినిమాను ఒకరు ప్రమోట్‌ చేసుకుంటూ పోస్ట్‌లు చేసుకునేవారు. 

కొద్ది రోజులుగా గమనిస్తే చై, సామ్‌ల సోషల్‌ మీడియా వాల్‌ మీద ఆ అప్‌డేట్‌లను నెటిజన్లు చాలా మిస్‌ అవుతున్నారు. అందుకు బయట చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్ఫర్ధలతో త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సమంత సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పేరు మార్చడంతో ఈ వదంతుకు కాస్త బలం చేకూరింది. తాజాగా ఓ సంఘటన కూడా ఇది నిజమే అనే ఆలోచనలోకి నెట్టేస్తుంది. సోమవారం నాగచైతన్య హీరోగా నటించిన లవ్‌స్టోరి సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆ ట్రైలర్‌ను చైతన్య ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా సమంత చిత్ర కథానాయిక సాయి పల్లవిని మాత్రమే ట్యాగ్‌ చేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. తన భర్త నాగచైతన్య పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చైతన్య మాత్రం సమంత ట్వీట్‌కు థ్యాంక్స్‌ అని ట్వీట్‌ చేశారు. ఈ పోస్ట్‌ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే చర్చ మొదలైంది. అయితే ఇద్దరూ డివోర్స్‌ తీసుకుంటున్నారు, చై–సామ్‌ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారనీ వస్తున్న వార్తలపై ఈ జంట ఎక్కడా స్పందించలేదు. నాగార్జున కుటుంబ సభ్యులు మౌనంగానే ఉన్నారు. దీనితో జనాలు ఇది నిజమేనేమో అని ఊహాల్లో ఉన్నారు. మరో పక్క సామ్‌ గోవా, చెన్నై ప్రాంతాలకు టూర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఎక్కడా చైతన్య కనిపించలేదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం పట్ల ఈ వార్త నిజమే అని భావిస్తున్నారు ప్రేక్షకులు. పైగా వీరిద్దరూ మాట్లాడుకునేది సోషల్‌ మీడియాలోనేనా అని కామెంట్లు చేస్తున్నారు. జూలై 9 తర్వాత చైతన్యకు సంబంధించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. చైతన్య కూడా అంతే! న్యూ ఈయర్‌ రోజున ఇద్దరి ఫోటోను షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చై–సామ్‌లకు సంబంధించి ఎలాంటి పోస్ట్‌ చై వాల్‌ మీద లేదు. 



అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.