సౌత్ మీడియా ముందుకు సమంత.. సమయం వచ్చేసింది
ABN , First Publish Date - 2022-04-13T03:25:33+05:30 IST
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత నార్త్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది కానీ.. సౌత్ మీడియా ముందుకు మాత్రం ఆమె రాలేదు. బాలీవుడ్‌కి సంబంధించిన కొన్ని మీడియా హౌస్‌లకు మాత్రం ఆమె స్పెషల్ ఇంటర్వ్యూలు

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత నార్త్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది కానీ.. సౌత్ మీడియా ముందుకు మాత్రం ఆమె రాలేదు. బాలీవుడ్‌కి సంబంధించిన కొన్ని మీడియా హౌస్‌లకు మాత్రం ఆమె స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఇప్పుడామె తమిళ్‌లో చేసిన ఓ చిత్రం కోసం మీడియా ముందుకు రావాల్సిన టైమ్ వచ్చేసింది. విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మొదలెట్టింది.
సినిమాలోని ‘టు టు టు’ అనే లిరికల్ సాంగ్‌ని మంగళవారం విడుదల చేశారు. సొంత సినిమా కావడంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం నయనతార కూడా దిగుతోంది. మాములుగా అయితే నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకాదు. అందుకు అనుగుణంగానే రెమ్యూనరేషన్‌ని ఆమె సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు తను హాజరు కావడమే కాకుండా సమంతని కూడా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా నయన్ కోరిందట. సో.. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఇప్పుడు సమంత మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ మీడియానే సమంత విడాకుల వ్యవహారం గురించి ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో.. ఇప్పుడు సౌత్ మీడియా కూడా సమంతని ఈ విషయంలో టార్గెట్ చేయడం ఖాయం. తన విడాకుల ప్రశ్నలపై సమంత సౌత్ మీడియాకి ఏం సమాధానం ఇస్తుందో తెలియాలంటే.. ఆ సమయం వరకు వేచి చూడక తప్పదు.