వరుణ్‌ధావన్ జోడీగా సమంత

ABN , First Publish Date - 2022-01-16T18:22:34+05:30 IST

అందాల సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో ‘శాకుంతలం, యశోద’ చిత్రాలతో బిజీగా ఉండగా.. కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్ని లైనప్ చేసుకుంటోంది. అదే సమయంలో వెబ్ సిరీస్ పై కూడా ద‌ృష్టిపెడుతోంది. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ తో సామ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందులో చేసిన నెగెటివ్ షేడ్స్ పాత్ర ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫ్యామిలీ మేన్ మేకర్స్ సామ్‌తో మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో మరింత భారీగా నిర్మాణం జరుపుకోబోతోంది.

వరుణ్‌ధావన్ జోడీగా సమంత

అందాల సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో ‘శాకుంతలం, యశోద’ చిత్రాలతో బిజీగా ఉండగా.. కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్ని లైనప్ చేసుకుంటోంది. అదే సమయంలో వెబ్ సిరీస్ పై కూడా ద‌ృష్టిపెడుతోంది. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ తో సామ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందులో చేసిన నెగెటివ్ షేడ్స్ పాత్ర ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫ్యామిలీ మేన్ మేకర్స్ సామ్‌తో మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో మరింత భారీగా నిర్మాణం జరుపుకోబోతోంది. ఇదో యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ అని సమాచారం. 


ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఫ్లాగ్ షిప్ సిరీస్ ‘సిటాడెల్’ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సిరీస్ ను ఇండియాలోనూ, ఇటలీలోనూ రీజనల్ వెర్షన్స్ లో తీయబోతున్నారు. సమంత కథానాయికగా ఈ సిరీస్ రూపొందనుంది. ఇందులో సామ్ తో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లోని పాత్రకోసం.. జిమ్ లో గంటలతరబడి కసరత్తులు చేస్తోంది సమంత. ఆమెపై భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించబోతున్నారు.  సామ్ మేకోవర్ అభిమానులకి షాకిస్తుందని చెబుతున్నారు. ఈ సిరిస్ కోసం అంతర్జాతీయంగా పేరున్న స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను బరిలోకి దింపుతున్నారట. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. 

Updated Date - 2022-01-16T18:22:34+05:30 IST