మాటల్లేవ్‌.. వీక్షించడమే: సమంత

ABN , First Publish Date - 2021-12-09T22:38:42+05:30 IST

గురువారం ఉదయం విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ గురించి హీరోయిన్‌ సమంత స్పందించారు. ట్రైలర్‌ వీక్షించిన అనంతరం ‘మాటల్లేవ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌, తారక్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ‘తారక్‌ నీ కళ్లల్లో అగ్నితో నువ్వు ఏమైనా చేయగలవు.

మాటల్లేవ్‌.. వీక్షించడమే: సమంత

గురువారం ఉదయం విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ గురించి హీరోయిన్‌ సమంత స్పందించారు. ట్రైలర్‌ వీక్షించిన అనంతరం ‘మాటల్లేవ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌, తారక్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ‘తారక్‌ నీ కళ్లల్లో అగ్నితో నువ్వు ఏమైనా చేయగలవు. వంద శాతం నా నమ్మకం ఇది’ అని సమంత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘తెరపై చరణ్‌లో చూసిన అత్యుత్తమ టాన్స్‌ఫర్‌మేషన్‌ ఇది. ఫైర్‌ ఫైర్‌ ఫైర్‌.. ఇది పూర్తిగా నీ సొంతం చెర్రీ’’ అని చెప్పుకొచ్చారు. అలాగే చాలామంది సినీ తారలు ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ చూసి సినిమా టీమ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తుంన్నారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. 




Updated Date - 2021-12-09T22:38:42+05:30 IST