Samantha: రెండో పెళ్లి నిజమేనా? ఈ వార్తలేంటి?

ABN , First Publish Date - 2022-09-22T04:59:50+05:30 IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రెండో పెళ్లి (Second Marriage) చేసుకోబోతున్నట్లుగా.. తాజాగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం..

Samantha: రెండో పెళ్లి నిజమేనా? ఈ వార్తలేంటి?

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రెండో పెళ్లి (Second Marriage) చేసుకోబోతున్నట్లుగా.. తాజాగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. ఆమె రెండో పెళ్లి దాదాపు కన్ఫర్మ్ అన్నట్లుగా టాక్ అయితే వైరల్ అవుతోంది. సమంతకు రెండో పెళ్లి చేసేందుకు ఆమె స్ర్పిచ్యువల్ గురువైనటువంటి సద్గురు (Sadhguru) లైన్‌లోకి దిగాడని, ఇప్పటికే ఆమెని రెండో పెళ్లికి ఒప్పించాడనేలా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియాల్సి ఉంది. 


వాస్తవానికి నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల తర్వాత.. కొన్నాళ్లపాటు డిప్రెషన్‌కి లోనైనట్లుగా ఇటీవల ఓ షో‌లో తెలిపిన సమంత.. దాని నుండి బయటికి రావడం కోసం.. ఎంతగానో ప్రయత్నాలు చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఆమె చేతిలో కూడా డిప్రెషన్‌ నుండి బయటికి రావడానికి ఉపయోగపడే పుస్తకాలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. సమంత అనుభవిస్తున్న బాధను గమినించిన సద్గురు.. మళ్లీ ఆమెని పెళ్లికి ఒప్పించాడని, ఆయన ఓకే చేసిన అబ్బాయినే సమంత పెళ్లాడబోతుందనేలా.. రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. (Samantha Second Marriage)


మరోవైపు.. నాగచైతన్య కూడా ఓ సెలబ్రిటీని మళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని, ప్రస్తుతం ఆ అమ్మాయితోనే కలిసి ఉంటున్నాడనేలా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కావాలనే కొందరు సమంత పెళ్లి మ్యాటర్‌ని హైలెట్ చేస్తున్నారనేలా కూడా టాక్ వినిపిస్తోంది. చైతూ (Chaitu) చేసుకుంటే.. సమంత చేసుకోదా ఏంటి? ఆమె కూడా రెండో పెళ్లికి సిద్ధంగా ఉందనేలా.. కావాలనే కొందరు ఈ వార్తలను పుట్టిస్తున్నట్లుగా కూడా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుండటం విశేషం. అయితే.. అటు చైతూగానీ, ఇటు సమంతగానీ.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై స్పందిస్తేనే కానీ.. ఇటువంటి రూమర్స్ ఆగవు. లేదంటే, వారానికో వార్త ఇలా వారిపై వైరల్ అవుతూనే ఉంటుంది. చూద్దాం.. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో...?


సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి ‘యశోద’ కాగా, రెండోది గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ చిత్రం. ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. ఇవి కాకుండా ‘ఖుషి’.. ఇంకా బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా సమంత నటిస్తోంది. నాగచైతన్య విషయానికి వస్తే.. తాజాగా ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇది చైతూకి 22వ సినిమా. ఈ సినిమా అతనికి తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. ఇందులో చైతూ సరసన మరోసారి కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.



Updated Date - 2022-09-22T04:59:50+05:30 IST