షారుఖ్ సినిమా వదులుకున్న సమంత..?

ABN , First Publish Date - 2021-10-17T19:03:39+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో నటించే ఛాన్స్ సమంత మిస్ అయిందా..అవుననే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ - షారుఖ్ కాంబినేషన్‌లో ఇటీవలే ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్రారంభించిన

షారుఖ్ సినిమా వదులుకున్న సమంత..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో నటించే ఛాన్స్ సమంత మిస్ అయిందా..అవుననే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ - షారుఖ్ కాంబినేషన్‌లో ఇటీవలే ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను పూణే మెట్రోలో కంప్లీట్ చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్‌కి సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్‌గా, ప్రియమణి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు అనుకున్న హీరోయిన్ సమంత అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో నటింపజేసేందుకు ముందు సమంతనే సంప్రదించారట. అయితే ఆమె, నాగ చైతన్యతో సమస్యలు తలెత్తి కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలా వద్దా అనే డైలమాలో ఉండి.. దీనిని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అలా సమంత రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్‌లోకే నయనతార వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాలీవుడ్‌లో ఓ మంచి ప్రాజెక్ట్‌ను సమంత మిస్ చేసుకున్నట్టే. కాగా ఇటీవలే సమంత ఓ రెండు కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. 

Updated Date - 2021-10-17T19:03:39+05:30 IST