నెగెటివ్ రోల్‌లో అదరగొట్టబోతున్న సామ్?

ABN , First Publish Date - 2022-01-07T21:34:54+05:30 IST

సమంత లో ఆకర్షించే గ్లామర్ తో పాటు, ఆకట్టుకొనే అభినయం కూడా ఉందని చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈ టాలెంట్ తోనే అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఏకకాలంలో సామ్ స్టార్ స్టాటస్ తెచ్చుకోగలిగింది. నాగచైతన్యను పెళ్ళి చేసుకున్న తర్వాత సామ్.. గ్లామర్ పాత్రల్ని పక్కనపెట్టి.. నటనకి బాగా స్కోపున్న పాత్రలు చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో సామ్ మళ్లీ గ్లామర్ పరంగా దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లోనూ, సినిమాల్లోనూ కాస్త ఎక్కువ మోతాదులోనే గ్లామర్ ఒలికిస్తోంది. అదే సమయంలో సరికొత్త పాత్రలతో ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతోంది.

నెగెటివ్ రోల్‌లో అదరగొట్టబోతున్న సామ్?

సమంతలో ఆకర్షించే గ్లామర్ తో పాటు, ఆకట్టుకొనే అభినయం కూడా ఉందని చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈ టాలెంట్ తోనే అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఏకకాలంలో స్టార్ స్టాటస్ తెచ్చుకోగలిగింది. నాగచైతన్యను పెళ్ళి చేసుకున్న తర్వాత సామ్.. గ్లామర్ పాత్రల్ని పక్కనపెట్టి.. నటనకి బాగా స్కోపున్న పాత్రలు చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో సమంత మళ్లీ గ్లామర్ పరంగా దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లోనూ, సినిమాల్లోనూ కాస్త ఎక్కువ మోతాదులోనే గ్లామర్ ఒలికిస్తోంది. అదే సమయంలో సరికొత్త పాత్రలతో ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగానే సామ్.. ప్రస్తుతం ఓ సినిమాలో నెగెటివ్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. సినిమా పేరు ‘కాత్తువాక్కుల రెండు కాదల్’. విజయ్ సేతుపతి, నయనతార జోడీగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 


టిపికల్ లవ్ స్టోరీ అయిన ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో నయనతారతో సమానమైన పాత్రను సమంత చేస్తోందట. అయితే ఆమె పాత్ర ఎవరూ ఊహించని రీతిలో నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో సామ్ అదరగొట్టేసిందని కోలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. కథ కీలక మలుపు తిరిగే అలాంటి పాత్రను సామ్ తన కెరీర్ లో ఎప్పుడూ చేయలేదని చెప్పుకుంటున్నారు. సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార ప్రేమాయణం సామ్ విలనిజంతో అనూహ్యమైన మలుపు తిరుగుందట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-01-07T21:34:54+05:30 IST