Samantha : ఆ చిత్రంలో హీరోయిన్ కాదా?

Twitter IconWatsapp IconFacebook Icon
Samantha : ఆ చిత్రంలో హీరోయిన్ కాదా?

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) చిత్రంలోని ‘ఊ అంటావా మావా’ పాట సూపర్ హిట్టవడంతో.. ఆ తర్వాత నుంచి సమంత (Samantha) కు ఆఫర్స్ ఆగడంలేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు ఒకటేమిటి? అమ్మడు అన్నిరకాలుగానూ బిజీ అయిపోయింది. త్వరలో తమిళ దళపతి విజయ్ (Vijay) హీరోగా, లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించబోయే సినిమాలో ఆమే హీరోయిన్ అనే ప్రచారం జోరందుకుంది. ‘విక్రమ్’ (Vikram) సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై మరింత హైపు క్రియేట్ అయింది. ద్విభాషా చిత్రం ‘వారసుడు’ (Varasudu) పూర్తయ్యేలోపు లోకేశ్ ఈ సినిమా స్ర్కిప్ట్‌ను ఫైనల్ చేయాలి. ప్రస్తుతం కథకథనాలపై లోకేష్ అండ్ టీమ్ పనిచేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాలోని సమంత పాత్ర విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం విజయ్, లోకేష్ చిత్రంలో సమంత హీరోయిన్ కాదట. నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీసాఫీసర్ గా నటించబోతోందని తెలుస్తోంది. ఆ పాత్ర తీరు తెన్నులు చెప్పగానే సమంత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మేన్ 2’ (Family Man 2) వెబ్ సిరీస్ లో సామ్‌కు .. నెగెటివ్ రోల్ చేసిన అనుభవముంది. దానికి ఆడియన్స్ నుంచి కూడా ఆమెకు మంచి అప్లాజ్ దక్కింది. కాబట్టి.. ఆమెకి విలన్ టచ్ ఉన్న పాత్రేమీ కొత్తకాదు. అయితే ‘నరసింహ’ (Narasimha) చిత్రంలో రమ్యకృష్ణ (Ramyakrishna) చేసిన నీలాంబరి పాత్రంతటి వెయిట్ ఉంటేనే ఇలాంటివి కెరీర్ పరంగా ఉపయోగపడతాయి. సమంత పాత్ర కూడా ఇందులో అదే తరహాలో డిజైన్ చేశాడట లోకేశ్ కనగరాజ్. 

గతంలో విజయ్ సరసన సమంత ‘కత్తి (Kaththi), తెరి(Theri), మెర్సల్ (Mersal)’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ మూడు సినిమాలూ సూపర్ హిట్సే. తెలుగులో బాగానే ఆడాయి. ప్రస్తుతం ‘శాకుంతలం (Shaakunthalam), యశోద (Yashoda)’ లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తుండడంతో పాటు ‘ఖుషీ’ (Khushi) లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీలోనూ నటిస్తోంది సామ్. ఇప్పుడు ఒకేసారి ఖాకీ డ్రెస్ తొడిగి విలనిజం ప్రదర్శించడం సమంత కెరీర్‌లోనే వెరైటీ కాబోతోంది. మరి ఈ సినిమాలో సమంత పాత్ర ఏ స్థాయిలో ఉండనుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.